SP Balasubrahmanyam : తెలుగు పాటంటే అందరి మదిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు వస్తారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతూ ఎన్నో వందల పాటలను పాడి అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఈ క్రమంలోనే ఆయన జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. జులై 4వ తేదీ బాలసుబ్రమణ్యం జయంతి కావడంతో ఆయన చేసిన సందర్భంగా బాలుకి ప్రేమతో 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు, ఆర్.పి పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ– బాలు గారు అంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎస్పీ బాలు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత కచేరి నిర్వహించి బాలు గారిజయంతిని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ వెల్లడించారు..
ఇకపోతే బాలుగారు జయంతి సందర్భంగా ఈ యూనియన్ లో భాగమైన సింగర్ లో కూడా బాలు గురించి, ఈ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలుకి ప్రేమతో అనే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా
సినీ మ్యూజిషియన్ యూనియన్స్ వెల్లడించారు. ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నారు.
Read Also : Viral video: డ్యాన్స్ తో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వేదికపైకి వస్తూ ఫుల్ జోష్
Tufan9 Telugu News And Updates Breaking News All over World