Vikram Movie Review : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే మొదటి షో నుంచి ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి లెజండ్రీ నటుడు కమల్ హాసన్ తెరపై ప్రేక్షకులు చూడలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలు మేరకు ఈ సినిమా థియేటర్ లో సందడి చేసిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటన అద్భుతం అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉంది.. ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…

kamal-hassan-vikram-movie-review-and-rating
కథ: సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఆ హత్యలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు పంపుతూ పోలీసులకు పెద్ద సవాల్ విసురుతారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన అమర్ ( ఫాహద్ పజిల్) ఈ మర్డర్ కేసుల గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా విక్రమ్ (కమల్ హాసన్) గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. దీంతో ఈ విక్రమ్ ఎవరు? సిటీలో జరుగుతున్న హత్యలకు ఈయనకు సంబంధం ఏమిటి అనే విషయాల గురించి కథ మొత్తం నడుస్తుంది.
నటీనటుల పనితీరు: ఇందులో కమల్ హాసన్ నటనకు జడ్జిమెంట్ ఇవ్వలేమని చెప్పాలి అంత అద్భుతంగా ఆయన నటించారు. కొన్ని చోట్ల ఏకంగా హాలీవుడ్ సినిమాలను తలపించేలా నటించారు. ఇక విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ నటన కూడా ఏమాత్రం కమల్ హాసన్ నటనకు తీసిపోలేదు.రోలెక్స్’ క్యారెక్టర్లో సూర్య క్యామియో సినిమాకి మాంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి.
సాంకేతికవర్గం: సినిమాటో గ్రాఫర్ గిరీష్ గంగాధరన్ వర్క్ ‘విక్రమ్’కి మెయిన్ ఎస్సెట్. సంగీత దర్శకుడు అనిరుధ్ ఎప్పటిలాగే తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించారు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒకరి పాత్రను దర్శకుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడిగా ఆయన 100% విజయాన్ని అందుకున్నారని చెప్పాలి.
విశ్లేషణ: దర్శకుడు లోకేష్ కమల్ హాసన్ అభిమానులకు ఫుల్ విందు భోజనం పెట్టినట్టు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం.
రేటింగ్ : 3/5
Read Also : Major Movie Review : ’మేజర్‘ మూవీ ఫుల్ రివ్యూ.. ప్రతి భారతీయుడిని కదిలించే సినిమా..!