Viral video : అడవి జంతువులు స్వభావం వైల్డ్ గానే ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయలేం. ఇంట్లో పెంచుకున్న వాటికి అడవిలో పెరిగిన వాటికి చాలా చాలా తేడా ఉంటుంది. అడవిలో ఉండి మాంసానికి అలవాటు పడే జంతువులు ఆకలి వేసినప్పుడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంటాయి. అందుకే వాటిని ప్రమాదకరమైనవి అంటారు.
అడవిలో వేరే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునే జంతువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులో సింహాలు, పులులు, తోడేళ్లు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇంకా చాలా ఉంటాయి. అందులో నక్కకు కూడా స్థానం ఉంటుంది. చిన్న పిల్లల కథలో చెప్పినట్లుగా నక్కలు కేవలం వేరే జంతువుల తిని వదిలేసిన వాటిని మాత్రమే తిని కడుపు నింపుకోవు. అవి కూడా వేటాడతాయి. చాలా పకడ్బందీ వ్యూహంతో దాడి చేసి మట్టుబెడతాయి. అందుకే నక్కలను జిత్తుల మారి అని అంటారు. చందమామ కథల్లోనూ నక్కలను మోసపూరితమైనవిగా చిత్రీకరించారు. కానీ జీవన పోరాటంలో అవి చాలా తెలివి ప్రదర్శిస్తూ వాటి పొట్ట నింపుకుంటాయి.
Fox attacks woman😱 pic.twitter.com/8xpJdhbTVh
Advertisement— Ross McCulloch (@Rossmac212) August 26, 2022
Advertisement
ఇక్కడ ఓ వీడియోలో నక్క చేసిన ఘనకార్యం ఉంది. చిన్నగా నక్క పిల్లగా కనబడుతున్న ఓ నక్క.. తనకంటే చాలా పెద్దగా ఉన్న మనిషిపై దాడి చేసింది. ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఓ నక్క వచ్చింది. ఆమె దాడి చేసి కాలిని గట్టిగా పట్టుకుంది. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా వదిలి పెట్టలేదు. మళ్లీ మళ్లీ దాడి చేసింది. అంతలోనే ఆమె భర్త పెద్ద కర్రను పట్టుకుని పరుగెత్తుకుంటూ రావడంతో ఆ నక్క అక్కడి నుండి పరుగులు లంక్కించుకుంది. ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియోలో తెగ హల్ చల్ చేస్తోంది.
Read Also : Viral video : అదిరిపోయే స్టెప్పులతో అద్బుతంగా డ్యాన్స్ చేసిన పెళ్లి కూతురు.. !