Why Samantha wants to Meet with naga chaitanya again on Web Series
Samantha : టాలీవుడ్‌లో మోస్ట్ లవలీ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంట.. అలాంటి క్యూట్ కపుల్ ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకోవడంతో అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. మళ్లీ చైతూ, సమంత కలిస్తే బాగుండుని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఏదిఏమైనా చైతూ, సమంతలు తమ నిర్ణయాలను మార్చుకుని అన్ని మర్చిపోయి మళ్లీ ఒక్కటి అయితే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Why Samantha wants to Meet with naga chaitanya again on Web Series
అయితే ఇప్పుడు సమంత చేసే పనులు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. మళ్లీ నాగచైతన్యను కలిసేందుకు సమంత ఎక్కువగా ఆరాటపడుతుందట.. అంతేకాదు.. చైతూ నటించే వెబ్ సిరీస్‌లో తానూ కూడా నటించేందుకు ఎక్కువగా ఆరాటపడుతుందట.. ఒకప్పుడు నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని.. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడిపేస్తున్నారు. నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో దూత వెబ్ సిరీస్ ఒకటి వస్తోంది. ఈ సిరీస్‌లో చైతూ నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) రిలీజ్ కానుంది.
నాగచైతన్య ఫస్ట్ టైం ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించి నాగచైతన్య ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. అందిన సమాచారం ప్రకారం చూస్తే.. ఈ వెబ్ సిరీస్‌లో సమంత కూడా నటించాలని తెగ ప్రయత్నాలు చేస్తుందట.. దూత వెబ్ సిరీస్ నేచురుల్ హారర్ థ్రిల్లర్.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నాగచైతన్య కనిపించనున్నాడు. ఈ సిరీస్‌లో నాగచైతన్య రోల్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో తమిళ ఆర్టిస్ట్ ప్రియా భవానీ శంకర్ కూడా నటించనున్నారు. మలయాళ స్టార్ నటి పార్వతి కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఫీమేల్ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉందట.. అది తెలిసిన సమంత ఎగిరి గంతేసిందట..
Why Samantha wants to Meet with naga chaitanya again on Web Series
ఏదైనా చేసి ఆ రోల్ తాను చేయాలని పట్టుబట్టిందట.. వెబ్ సిరీస్‌లో తాను నటిస్తానంటూ దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌ని సమంత బతిమిలాడుతుదంట.. ఆ గెస్ట్ రోల్ తనకు చేయాలని ఉందని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తుదంట.. సామ్ కోరికను కాదనలేక డైరెక్టర్ విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.. అది తెలిసిన చైతూ ఫ్యాన్స్ మాత్రం.. సమంతను ఆ వెబ్ సిరీస్‌లో నటించవద్దని కామెంట్లు చేస్తున్నారట.. ఇదంతా చూస్తుంటే.. సమంత ఎందుకు మొండిపట్టు మరి ఆ వెబ్‌సిరీస్ లోనే నటిస్తానంటోంది. మరోవైపు తన ఇన్‌స్టాలో ఒక పోస్టు కూడా డిలీట్ చేసిందట..
ఒకవేళ చైతూకు దగ్గరయ్యే ఉద్దేశమే లేకపోతే.. ఆ వెబ్ సిరీస్‌లోనే ఎందుకు సామ్ నటిస్తానంటోంది. అంటే.. ఒకరకంగా చెప్పాలంటే.. సమంత.. మళ్లీ చైతూ దగ్గరయ్యేందుకు ఇలా చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా దూత వెబ్ సిరీస్‌లో నటిస్తుందనే విషయం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కొద్దిరోజుల్లో ఈ ఊహాగానాలకు చెక్ పడనుంది.
Read Also : Samantha, Naga chaithanya: సమంత, చై మళ్లీ ఒక్కటికాబోతున్నారా.. నిజమేనంటున్న సామ్ పోస్ట్!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.