...

Viral video: తెల్ల, పసుసు రంగు పులుల మధ్య భీకర పోరు.. ఏది గెలిచిందో తెలుసా?

Viral video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు ైరల్ అవుతుంటాయి. అందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కల్గించగా… మరికొన్ని హాస్యాన్ని కల్గిస్తాయి. అయితే జంతువుల కంటెంట్ కి సంబంధించిన వీడియోలకి ఇంటర్ నెట్ లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెటిజెన్లు ఈ వీడియోలని ఎక్కువగా ఇష్ట పడుతారు. తాజాగా రెండు పులులకి మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వాస్తవానికి అడవిలో ఒకే నియమం ఉంటుంది. చంపండి లేదా చావండి. ఇక్కడ ప్రతి జంతువు మనుగడ సాధించాలంటే పోరాడాల్సిందే. ముఖ్యంగా క్రూర జంతువులైన పులులు, సింహాలు అడవిలో వాటి పరిధిని సృష్టించుకుంటాయి. ఆ పరిధిలోకి మరో జంతువు వస్తే అంతే సంగతులు. తాగాజా ఓ తెల్ల పులి ఓ పసుపు పులి ఏరియాలోకి వచ్చినందుకు రెండిటి మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మూడు పులులు కనిపిస్తాయి. ఇందులో ఒక తెల్లపులి రెండు పలుసు పులులు ఉంటాయి. అయితే తెల్లపులి పుసుపు పులుల పరిధిలోకి రావడంతో అసలు కథ మొదలవుతుంది. వాస్తవానికి ఏ పులి అయినా దాని పరిధిలోకి మరో పులిని రానివ్వదు. ఇది అడవి నియమం. ఇక్కడ తెల్లపులి పసుపు పులి పరిధిలోకి రావడంతో యుద్ధం మదలవుతుంది. అయితే రెండు పులులు భీకరంగా పోరాడుతాయి. రెండు గర్జిస్తూ… భయంకరంగా కొట్టుకుంటాయి. ఆ రెండు పులుల గర్జనలు అడవి మొత్తం ప్రతిధ్వనిస్తాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ యానిమల్ ప్లానెట్ అనే అకౌంట్ ద్వారా ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అడవి జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఈ పేజీలో ఉంటాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 22 వేల మందికి పైగా చూశారు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by @best_animals_planet