Dog Crying : శునకం విశ్వాసానికి ప్రతీక. మనుషుల కంటే కూడా చాలా నమ్మకంగా ఉంటుంది. కాస్త అన్నం పెట్టిన 24 గటలూ మనతోనే ఉంటుది. అయితే అలాంటి కుక్క ఏడుపును అపశకునంగా భావిస్తారు చాలా మంది. కుక్కకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలుస్తుందని, అలాగే ఏమైనా ప్రకృతి విపత్తులు రాబోతున్నప్పుడు కూడా వాటిని శునకం పసిగడుతుందని చాలా మంది నమ్మకం.
అయితే శివుడు జటాజూటం నుంచి ఉద్భవించిన కాల భైరవుడు కుక్కను తన వాహనంగా చేసుకొని దానికి కొన్ని అతీత శక్తులు ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే కుక్కలు భవిష్యత్తు కాలంలోకి తొంగి చూసి ఏం జరగబోతుందో తెలుసుకుంటుందని అంటారు. వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమ భటులు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉంటారని.. వారిని చూసిన కుక్కలు అక్కడ అశుభం జరగబోతుందని ముందస్తు హెచ్చరికగా ఏడుస్తుందట.
అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితం అయింది. కుక్కలు తన చుట్టూ జరిగే రసాయనిత మార్పును ముందే పసిగట్టగలదట. వీటికి మనిషి కంటే వినికిడి, వాసన, శక్తి చాలా ఎక్కువ అని మన శాస్త్రజ్ఞులు ఎప్పుడో తేల్చి చెప్పారు.
Read Also : Pavitra lokesh: సెట్స్ లో పవిత్రా లోకేష్ కు ఘోర అవమానం.. అసలేమైందంటే!