...

Lovers Class room : క్లాసురూంలో అందరి ముందు ఇదేం పని.. తీరా చూస్తే..!

Lovers Class Room : సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు ఏది వైరల్ గా మారుతుందో చెప్పలేం. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు కొందరు పిచ్చి వేషాలు వేస్తుంటారు. ఏవేవో చేస్తూ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. కొందరైతే నలుగురిలో ఉన్నామన్న కనీస విషయాన్ని కూడా మరచిపోయి ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం ఇద్దరు లవర్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్లాస్ రూములో ప్రొఫెసర్ ఎదురుగానే ఓ చిలిపి పని చేశారు ఇద్దరు లవర్స్. హద్దులు మరచిపోయి ప్రవర్తించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా… దీనిపై చాలా మంది ఫన్నీగా స్పందిస్తున్నారు. ఫన్నీగా స్పందించడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. అప్పడే ఇందులోని ట్విస్ట్ ఎంటో తెలుస్తుంది.

viral-video-two-college-lovers-front-professor-see-what-happen-next (1)
viral-video-two-college-lovers-front-professor-see-what-happen-next

తరగతి గదిలో ప్రొఫెసర్ ఉండగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. యువతి భుజంపై చేయి వేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ చెంపను ముద్దాడుతాడు. దీనిని వెనకాల నుంచి ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ల ముఖాన్ని చూపిస్తాడు.

దీంతో అసలు ‘గర్ల్ ఫ్రెండ్’ ఎవరో చూడటమే ఈ వీడియోలోని ట్విస్ట్. పొడవాటి జుట్టుతో వెనక కూర్చున్న వ్యక్తి అచ్చం అమ్మాయిలాగా కనిపించినప్పటికీ అక్కడుంది అబ్బాయి. ఆ ‘ప్రియుడు’ కేవలం తన స్నేహితుడి జుట్టుతో చిలిపిగా అలా చేశాడు. చివరికి ముగ్గురు స్నేహితులు దగ్గరగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. అయితే రొమాన్గా భావించిన నెటిజన్లు.. చివరికి అది ‘బ్రొమాన్స్’ అని తేలడంతో పడి పడి నవ్వుకున్నారు.

Read Also : Hair Growth: పొడవైన ఒత్తైన జుట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా… వారానికి ఒకసారి ఈ చిట్కా పాటించండి… అందమైన జుట్టు మీ సొంతం!