Viral Video : స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీలతో పాటు సామాన్యుల కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సామాన్యులు తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవటానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. ప్రస్తుతం చాలామంది యువతి యువకులు తమలో ఉన్న టాలెంట్ నీ నిరూపించుకోవడానికి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎంతోమంది నెటిజన్స్ డాన్స్ వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్‌గా గా పనిచేస్తున్న ఉమా మీనాక్షి కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే డాన్స్ వీడియోలతో ఎంతోమంది నెటిజన్స్ ఈమెకు అభిమానులుగా మారిపోయారు.
ఇలా తరచూ సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు షేర్ చేసి ఈ అమ్మడు ఎంతో అందంగా ఉండటమే కాకుండా ఇలా అద్భుతంగా డాన్స్ చేయడంతో రోజురోజుకీ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. ఇటీవల ఈ అమ్మడు మరొక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. 1998 విడుదలైన చైనా గేట్ సినిమాలోని చమ్మా..చమ్మా అనే పాటకు డాన్స్ ఇరగదీసింది. ఆ సినిమాలోని ఒరిజినల్ పాటలో డాన్స్ చేసిన ఊర్మిళను అనుకరిస్తూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసింది. నలుపు రంగు టాప్, ఆకుపచ్చ స్కర్ట్, వైట్ స్నీకర్ల ధరించి మీనాక్షి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
Viral Video: డాన్స్ వైరల్ వీడియో
ఇలా డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ అమ్మడు ఇప్పటికే 921k మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటలకు తనదైన శైలిలో అదిరిపోయే స్టెప్పులేస్తూ వీడియోలను షేర్ చేయడం ద్వారా ఉమా మీనాక్షి సోషల్ మీడియా స్టార్ గా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీనాక్షి డాన్స్ వీడియోకి నెటిజన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
ReadAlso : Viral Video: అది నడుమా.. స్ప్రింగా.. డ్యాన్స్ తో అల్లాడిస్తోంది!