Varalakshm Vratham 2022 : శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుతుంటారు. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సంపదలిచ్చే తల్లి. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద ,జ్ఞాన సంపద మొదలైనవి చాలానే ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి నీ“ శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే సుప్రదే” అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయడం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతం ధన, కనక ,వస్తు, వాహనాలు సమృద్ధిలకు మూలం. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వలన పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
పూజ సామాగ్రి : పసుపు, కుంకుమ, గంధం, తమలపాకులు, ముప్పై ఒక్కలు, ఖర్జూరాలు, విడిపూలు, పూల దండలు, కొబ్బరికాయలు, తెల్లని వస్త్రం, జాకెట్ ముక్కలు, కర్పూరం, అగరవత్తులు, చిల్లర పైసలు, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, పసుపు పూసిన కంకణాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి, బియ్యం, ఇంట్లో చేసిన నైవేద్యాలు.
వ్రతం ఆచరించే విధానం : వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో ఒక మండపాన్ని తయారు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో తయారు చేసి కలశానికి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, అక్షింతలు, తోరణాలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
తోరణం తయారీ : తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని పసుపు రాయాలి. ఆ ధారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారుచేసుకున్న తోరణాన్ని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పూజ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా తోరణాలు తయారు చేసుకున్న అనంతరం పూజకు సిద్ధం కావాలి. ముందుగా గణపతిని పూజించి పూజను ప్రారంభించాలి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. దాని తర్వాత కథను ప్రారంభించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
Read Also : Vastu Tips : శ్రావణమాసంలో ఈ ఐదు చెట్లను పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు మీ సొంతం..?