Ukraine Bahubali : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు యుక్రెయిన్ పౌరులు.. ఎలాగో చస్తాం.. చచ్చేలోపు రష్యాపై పోరాడే చస్తామనే కసి.. పౌరుషంతో రగిలిపోతున్నారు యుక్రెయిన్లు.. చావో రేవో అన్నట్టుగా రష్యా దాడులకు ఎదురువెళ్తున్నారు. తమ దేశంలోకి చొచ్చుకుని వస్తున్న రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటున్నారు. యుక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శించాడు.
రష్యా యుద్ధ ట్యాంకులను ఒంటిచేత్తో బాహుబలిలా ఆపేశాడు. రష్యా మిలటరీ వాహనాల కాన్వాయ్ వస్తుండగా ఈ యుక్రెయిన్ బాహుబలి ఎదురెళ్లాడు. రష్యా బలగాలకు అడ్డంగా నిలిచాడు. అంతటితో ఆగలేదు.. ఉత్తర యుక్రెయిన్‌లోని బక్మాచ్ నగర వీధుల్లో దూసుకొస్తున్న ఓ రష్యా యుద్ధ ట్యాంకును ఈ బాహుబలి ఆపేశాడు. చైన్‌ల ఆధారంగా నడిచే యుద్ధ ట్యాంకు మెల్లగా ముందుకు కదులుతోంది. ఆ ఉక్రెయిన్ పౌరుడు ఆపేశాడు.
యుద్ధ ట్యాంకుకు అడ్డుకుని తన చేతులతో బలంగా ఆపేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ యుద్ధ ట్యాంకు అక్కడే ఆగిపోయింది. కొంత దూరం వెళ్లిన అతడు మోకాళ్లపై కూర్చొన్నాడు. ట్యాంకు కదిలితే తన మీది నుంచే వెళ్లాలంటూ అలానే అడ్డంగా కూర్చొన్నాడు. అక్కడి స్థానికులు అతన్ని చూసి దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అతన్ని పక్కకు తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram