Amardeep : తెలుగు వెండితెరపై ప్రసారమయ్యే జానకి కలకనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ప్రధాన పాత్రలో రామచంద్రగా నటిస్తున్న అమర్‌దీప్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమర్‌దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. కోయిలమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన తేజస్విని గౌడ. ప్రస్తుతం అనసూయ సీరియల్‌లో నటిస్తున్న తేజస్విని అమర్‌దీప్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అమర్దీప్, తేజస్వినీ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫొటోలను అరియానా గ్లోరీ, హాజరై సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్‌దీప్- తేజస్వినిలతో ఫొటోలు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. అమర్‌దీప్, తేజస్విని నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇది నిజంగా షాకింగ్ అంటూ సీరియల్ నటులు అభిమానులు వెల్లడించారు. అమర్‌దీప్ తేజస్వినికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సీరియల్ ఆర్టిస్ట్‌లు ప్రభాకర్ దంపతులు హాజరై సందడి చేశారు. ఇప్పటికే అమర్‌దీప్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్ డాన్సుతో ఊపేసారుగా.. వీడియో!