Intinti Gruhalakshmi june 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకు పోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు పెట్టుబడి కోసం లాస్య డబ్బులు నేను ఇస్తాను అని అనడంతో నందు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి సంగీతం నేర్చుకునే పిల్లల కోసం ఒక షెడ్ నిర్మిస్తూ ఉండటం చూసిన కుటుంబ సభ్యులు వెళ్లి తులసి కి సహాయం చేస్తారు. ఇంతలో తులసి ఇంటి దగ్గరికి లోన్ ఇవ్వడం కోసం అధికారులు వస్తారు. అప్పుడు ఎలా అయినా తులసిని మాయ చేసి లోన్ ఇవ్వాలి అనే ఆ అధికారులు ప్లాన్ చేసుకోగా అప్పుడు అంకిత, పరంధామయ్య లు వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఆ లోన్ ఇచ్చే అధికారులు ఈ సారి వచ్చేటప్పుడు వీరు లేనప్పుడు రావాలి అని మనసులో అనుకుంటారు. అప్పుడు తులసి లోన్ వస్తుంది అని సంతోష పడుతూ ఉంటుంది.
అంతేకాకుండా ఆ డబ్బులలో ప్రేమ్ కు కూడా సహాయం చేయాలి అని అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ సంతోషం గా కనిపిస్తూ ఉంటాడు. శృతి దగ్గరకు వచ్చి మీ ఫ్రెండు డబ్బులు ఇస్తుంది అన్నావ్ కదా ఫోన్ చేసి అడుగు అనగా అప్పుడు శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే శృతికి తులసి ఫోన్ చేసి ప్రేమ కోసం ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పడంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అప్పుడు శృతి,ప్రేమ్ కి తులసి పేరు చెప్పకుండా ఫ్రెండ్ డబ్బులు ఇస్తుంది అనడంతో ప్రేమ్ సంతోషంగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అభి,గాయత్రి ఇద్దరూ అంకిత గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు అభి, అంకిత నను అక్కడికి రమ్మని అంటుంది ఆంటీ అని అనగా అలా ఎలా వెళ్తావు అభి అని అనడంతో అంకుల్ మీ మాట వింటున్నారు కదా అని అనగా వెంటనే గాయత్రీ మౌనంగా ఉండి పోతుంది.
మరొకవైపు లాస్య లోన్ అధికారులతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ లోన్ అధికారులు లాస్య చెప్పిన విధంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి తులసిని పెద్ద కష్టం లో పడే విధంగా చేస్తుంది. ఆ తర్వాత సంతోషంతో లాస్య నవ్వుతూ ఉంటుంది. ఇంతలోనే లోన్ అధికారులు వచ్చి తులసికి మాయమాటలు చెప్పి ఫేక్ డాక్యుమెంట్ల మీద సంతకం చేయించుకుని అకౌంట్లో 20 లక్షలు వచ్చాయి అని చెప్పడంతో సంతోష పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత అంకితమిచ్చి డబ్బులు పోయాయి అని మెసేజ్ చూసి చెప్పడంతో అందరూ ఒక్క సారిగా షాక్ అవుతారు. అంతేకాకుండా ఆంటీ ఫేక్ డాక్యుమెంట్స్ పైన సైన్ చేసింది తిరిగి కేసు పెట్టాలి అన్న కూడా మనకు ఎదురు దెబ్బ తగులుతుంది అని అనడంతో తులసి ఎమోషనల్ అవుతుంది.