Intinti Gruhalashmi june 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అంకిత డబ్బులు ఇస్తాను అని అనడంతో తులసి వద్దు అని అంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో తులసి, భాగ్య అక్కడికి వచ్చి కాసేపు గాయత్రి కి అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు లాస్య అసలు విషయం చెప్పడంతో గాయత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య భాగ్యా ఇద్దరు గాయత్రి ని మరింత రెచ్చగొట్టి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు.

Intinti Gruhalashmi june 30 Today Episode
మరొకవైపు తులసి ఫ్యామిలీ అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య షూరిటీ విషయం గురించి అంకితతో మాట్లాడుతూ ఎందుకు షూరిటీ సంతకం పెట్టావ్ అంకిత అని ప్రశ్నించగా.. నాకు కూడా పెట్టాలని లేదు తాతయ్య కానీ తులసి ఆంటీ పరువు పోతుంది అందుకే ఆ సమయంలో నేను సంతకం చేయాల్సి వచ్చింది అని అంటుంది అంకిత.
ఇంతలోనే తులసి వారి కోసం బజ్జీలు తీసుకుని రావడంతో అవి తిని వారందరూ బాగున్నాయి అని పొగుడుతూ ఉంటారు. ఇంతలోనే గాయత్రి వచ్చి ఎందుకు బాగుండవు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు అంకిత తులసి ఎక్కడ నిజం తెలిసిపోతుంది ఎక్కడ తన తల్లి గొడవ చేస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు గాయత్రి తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు తులసి ఏమి అయ్యింది వదిన ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనడంతో అప్పుడు నా కూతురితో 20 లక్షల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టించుకున్నావు కదా అని అనగా ఆ మాటలకూ తులసి లేదు అని గాయత్రి తో వాదిస్తుంది.
అప్పుడు గాయత్రిని నమ్మించడానికి తులసి దివ్య పై ఒట్టు వేయబోతుండగా అప్పుడు అంకిత అడ్డుకొని అసలు విషయం చెప్పడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత గాయత్రికి నచ్చ చెబుతూ నీ కూతురు డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోను నేనే సొంతంగా కట్టేస్తాను అని అంటుంది. వెంటనే గాయత్రి ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏం చేస్తావు అని అనడంతో నీ కూతురిని శాశ్వతంగా మీ ఇంటికి పంపించేస్తాను అని చెప్పగా తులసి కుటుంబం మొత్తం షాక్ అవుతారు.