...
Telugu NewsLatestIntinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు...

Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..?

Intinti Gruhalashmi july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తన 20 లక్షలు మాయం అవ్వడానికి లాస్యనే కారణం అని తెలుసుకుంటుంది తులసి. ఈరోజు ఎపిసోడ్ లో నందు దంపతులు వారి కంపెనీ టీం పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి ఏమి తెలియనట్టుగా లాస్యకు ఫోన్ చేయడంతో లాస్య కావాలని తెలిసి తెలియనట్టుగా కాల్ లిఫ్ట్ చేసి పక్కన పెడుతుంది.

Tulasi, Ankitha and Divya team up to corner Lasya in todays intinti gruhalakshmi serial episode
Tulasi, Ankitha and Divya team up to corner Lasya in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు నందు తులసి గురించి ఓవర్ గా మాట్లాడుతూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే అందుకు గల కారణం లాస్య అంటూ లాస్యను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం లాస్య. నాకు మాట ఇచ్చిన వెంటనే నా ముందు 20 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. అని అనడంతో ఆ మాటలు వింటున్న తులసి షాక్ అవుతుంది.

Advertisement

ఆ తరువాత భాగ్య నందు మాటలకు టెన్షన్ పడుతూ నాకు ఏదో భయంగా ఉంది లాస్య బావగారికి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆ డబ్బు తులసి అక్కది అని తెలిస్తే గొడవ చాలా పెద్దది అవుతుంది అని అంటూ ఉండగా ఫోన్లో వారిద్దరి మాటలు విన్నతులసి మరింత షాక్ అవుతుంది. ఆ తర్వాత లాస్య తులసి తో ఫోన్ మాట్లాడటం కోసం పక్కకు వెళ్ళగా అప్పుడే నందు అక్కడికి వచ్చి నువ్వు ఇచ్చిన 20 లక్షలతో నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాను.

నీకు 20 లక్షల రూపాయలు ఇచ్చే గొప్ప ఫ్రెండ్స్ ఉండటం నిజంగా నీ గ్రేట్ అని నందు లాస్యను పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత నందు అక్కడి నుంచి వెళ్లిపోయాక తులసి మాట్లాడుతూ నిజంగా నీకు 20 లక్షలు ఇచ్చే గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్ నాకు కూడా ఉంటే బాగుండు అంటూ లాస్యతో కాస్త వెటకారంగా మాట్లాడి ఫోన్ కట్ చేయడంతో లాస్య కాస్త టెన్షన్ గా కనిపిస్తుంది.

Advertisement

ఆ తరువాత దివ్య అంకిత తులసి ముగ్గురు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఆ తులసి పరంధామయ్య దంపతులకు తెలియకుండా ఉండాలి అని అనుకుంటారు. మరొకవైపు లాస్య తులసి గురించి తెలుసుకోవడానికి భాగ్య నీ తులసి ఇంటికి పంపిస్తుంది. ఇక తులసి కుటుంబం భోజనం చేస్తూ ఉండగా ఇంతలో ఆ భాగ్య వచ్చి వారందరిపై లేనిపోని ప్రేమలు ఉలుకబోస్తూ నటిస్తుంది.

అప్పుడు పరంధామయ్య దంపతులు భాగ్యాన్ని వెటకారంగా మాట్లాడడంతో తులసి కావాలనే భాగ్య నీ వెనకేసుకొస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య భాగ్య ఇద్దరు రోడ్డుపై పరుగులు తీస్తూ ఒక చోటికి చేరుకుంటారు. అక్కడ రంజిత్ కు బదులుగా లాస్య ఫ్యామిలీ ఉండడంతో షాక్ అవుతారు. అప్పుడు లాస్య నా 20 లక్షలు తీసుకొని మీ ఆయన నందు కి కంపెనీ పెట్టి ఇస్తావా నువ్వు ఏం చేస్తావో తెలియదు 24 గంటల్లో నా 20 లక్షలు నా అకౌంట్ లో ఉండాలి లేదంటే నీ అంతు చూస్తాను అనడంతో లాస్య షాక్ అవుతుంది.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi june 30 Today Episode : తులసిపై మండిపడ్డ గాయత్రి.. లాస్య అంతు చూస్తానన్న తులసి..?

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు