Intinti Gruhalakshmi September 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పూజ పూర్తి అయినందుకు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో తులసి హడావిడిగా ఉండగా ఇంతలో అంకిత,ప్రేమ్ దంపతులు అక్కడికి వచ్చి తులసికి సామ్రాట్ విషయంలో సలహా ఇస్తూ ఉంటారు. ఇక వారందరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. నందు లాస్య కూడా వారు మాట్లాడుతున్న మాటలను చాటుగా వింటూ ఉంటారు.

అప్పుడు తులసి వారికి నచ్చ చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా ఉండగా అనసూయ ఇన్ డైరెక్ట్ గా లాస్య మీద పంచులు వేస్తూ ఉంటుంది. దాంతో అందరు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు.
అందరూ నవ్వుకుంటూ ఉండగా అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇల్లు అంటే ఇదిరా అనుబంధాలు అంటే ఇవి అని అంటాడు. ఆ తర్వాత లక్కీ ఆంటీ ఉండ్రాళ్ళు వినాయకుడికి ఎందుకు నైవేద్యంగా పెడతారు అని అడగగా అప్పుడు తులసి వినాయకుడి కి ఉండ్రాళ్ళను ఎందుకు పెడతారు అన్న విషయం గురించి గొప్పగా చెబుతుంది.
Intinti Gruhalakshmi Sep 13 Today Episode : సంతోషంలో తులసి కుటుంబం..?
ఆ తర్వాత సామ్రాజ్ చెయ్యి కడుక్కుంటూ ఉండగా తులసి అక్కడికి వెళ్లి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తుంది. అప్పుడు సామ్రాట్ తులసికి క్షమాపణలు చెబుతాడు. అప్పుడు సరే ఇంకా బయలుదేరుతాను తులసి గారు అని సామ్రాట్ అనగా ఇంతలో దివ్య అక్కడికి వచ్చి ఈరోజు మీరు ఇక్కడే ఉండండి అంకుల్ రాత్రికి ప్రోగ్రాం ఉంటుంది అని అంటుంది.
ఆ మాటలు వింటున్న నందు, లాస్య లు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత నందు లాస్య ఇద్దరు మేము వెళ్తున్నాం అభి అని అభికి చెప్పగా అదేంటి డాడీ ఈవినింగ్ పార్టీ ఉంది కదా అని అనడంతో వెంటనే లాస్య వద్దులే ఇప్పటికే పిలవకుండా వచ్చినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాము అని అనగా అప్పుడు అభి నందు నీ ఉద్దేశించి మాట్లాడుతూ నందుని అవమానించే విధంగా మాట్లాడతాడు.
ఆ తర్వాత పార్టీ మొదలవుతుంది. ఇంట్లో అందరూ పార్టీ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు, అభి, అంకిత మీద తనకు ఎంత ప్రేమ ఉందో అందరి ముందు చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ్, శృతి అందరి ముందే సీరియస్గా గొడవ పడుతూ ఉంటారు.
Read Also : Intinti Gruhalakshmi: అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన సామ్రాట్.. షాక్ లో తులసి, నందు..?