Farmer success story : దేశంలో చాలా మంది రైతులు తులసి సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. యూపీలోని ఫిలిభిత్ లో నివసించే నదీమ్ ఖఆన్ జీవితాన్ని తుసి మొక్క మార్చేసింది. నదీమ్ ఖాన్ అంతకుముందు తన సాధారణ వ్యవసాయం నుండి పెద్దగా సంపాదించలేకపోయాడు. వాతావరణం, తెగుళ్ల వ్యాప్తి కారణంగా అతను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. పంటలను పెంచడానికి పెట్టుబడి మొత్తం. దాన్ని తీయడం కష్టంగా మారడం తరచుగా జరిగేది. తులసి సాగు ప్రారంభించినప్పటి నుంచి నదీమ్ ఖాన్ జీవితం మారిపోయింది.
నదీమ్ గతంలో లక్ష రూపాయల కోసం ఉరంతా తిరిగాడు. కాన ఎవరూ అతడికి డబ్బు సాయం చేయలేదు. కానీ జయేంద్ర సింగ్ సూచనలో తులసి సాగు చేసి నేడు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గత ఎనిమిదేళ్ల నుంచి ఈ ట్రెండ్ నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతం నదీమ్ తులసి సాగు ద్వారా సంవత్సరానికి 10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు.
డాబర్, పతంజలి, హమ్దార్ద్, బైద్యనాథ్, ఉంజా, జండూ వంటి పెద్ద ఒషధ కంపెనీలు తులసి ఆకులు, మొక్కలను క్వింటాల్ కు రూ.700 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. తులసి పంటకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఆయుర్వేదం నుంచి హోమియోపతి వరకు తులసికి అధిక డిమాండ్ ఉంటుంది.
Read Also : B.Tech Chaiwali : చదువులమ్మ.. బీటెక్ చాయ్ వాలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి.. ఈమె రియల్ స్టోరీ చదవాల్సిందే..!