TS Academic Calendar : తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 నిమిషాల వరకు పనిచేస్తాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.45 నిమిషాల వరకు విధులు నిర్వహిస్తాయి. 2022-23 సంవత్సరంలో 230 పనిదినాలతో పాఠశాలలు పనిచేస్తాయని విద్యా క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
నవంబరు 1 నుంచి 7 వరకు SA1 పరీక్షలు, 2023 ఏప్రిల్ 10 నుంచి 17 వరకు SA2 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28లోగా 10వ తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చిలోనే 10వ తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు 14 రోజులు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలంగాణ అకడమిక్ క్యాలెండర్‌లో వెల్లడించారు. ఈ అకడిమిక్ ఇయర్‌కు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తమ సిలబస్ పూర్తిచేయాల్సి ఉంటుందని, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించింది.
ప్రాథమిక పాఠశాలల పనిదినాలు :
– ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు
ప్రాథమికోన్నత పాఠశాలలు :
ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు
ఉన్నత పాఠశాలల తరగతులు :
ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు
సెలవులు :
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు) ఉంటాయి.
బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి 16 రోజులు సెలవులు
క్రిస్మస్ సెలవులు.. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఉంటాయి.
జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు) ఉంటాయి.
ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
వేసవి సెలవులు :
– ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి.
Read Also : Ramya Raghupathi: రమ్య రఘుపతి వ్యాఖ్యలపై స్పందించిన పవిత్ర లోకేష్?