Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా లక్కే లక్కు అని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి ధనాగమనసిద్ధి ఉంది. దీని వల్ల మీకు ఎక్కువ ధనలాభం కల్గుతుంది. కాబట్టి వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధు మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.
కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లకు ఆయా రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని శుభ ఫలితాలు కల్గుతాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనః స్సౌఖ్యం ఉంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.