Wrong challan : మన దేశంలో రోడ్లపై వాహనాలు నడిపే వారిలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అలవాటులో పొరపాటుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. హెల్మెట్ లేకున్నా, సిగ్నల్ జంప్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ లో వెళ్లినా పోలీసులు ట్రాఫిక్ ఛాలాన్లు వేస్తుంటారు. దాన్ని మనం కచ్చితంగా కట్టి తీరాల్సిందే. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ లేకున్నా ఛలాన్స్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటిస్తేనే ఛలాన్ల నుంచి విముక్తి పొందవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ప్రస్తుత మోటారు వాహనాల చట్టాల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు శిక్షలు విధిస్తారు. జరిమానాలు కూడా వేస్తుంటారు.
ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు తప్పు చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున నెంబర్ తప్పుగా కొట్టడం, ఒక ఫైన్‌కు బదులుగా మరో ఫైన్ ఎంటర్ చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు ఛలాన్లు కట్టకపోయినా నడుస్తుంది. ట్రాఫిక్ పోలీసులు పొరపాటున మీకు ఛలాన్ వేసినట్లయితే.. సంబంధిత విభాగాన్ని సంప్రదించవచ్చు అనే నిబంధన కూడా ఉంది. మీరు వెళ్లి వీరికి ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకపోయినా మీరు కోర్టులో కూడా ఛలాన్ సవాలు చేయవచ్చు.
Read Also : Aadhar loan: ఆధార్ పైన లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?