...

Karthika Deepam july 6 Today Episode : హిమ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జ్వాలా.. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సౌర్య..?

Karthika Deepam july 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్వాలాకి అసలు విషయం తెలియడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా మాట్లాడుతూ నా నుంచి నా ప్రేమను లాగేసుకున్నావు డాక్టర్ సాబ్ ని దూరం చేశావు నువ్వు ఒక మోసగాతివి అంటూ హిమపై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు హిమ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జ్వాలా మాత్రం నోరు ముయ్యి అంటూ అందరి ముందు గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావు లకు చేతులెత్తి మొక్కి ఆది దంపతులు, మహానటులు అని అనడంతో వారు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు.

Advertisement
Karthika Deepam july 6 Today Episode
Karthika Deepam july 6 Today Episode

అప్పుడు హిమ నన్ను క్షమించు సౌర్య అని అనడంతో వెంటనే హిమ చంపచళ్ళు మనిపిస్తుంది. అయితే అదంతా కూడా జరిగినట్టుగా ఊహించుకుంటుంది హిమ. ఆ తర్వాత హిమ వెళ్లి జ్వాలకి శాలువా కప్పి అవార్డును అందిస్తుంది. ఆ సందర్భంగా జ్వాలా మాట్లాడుతూ డాక్టర్ హిమ గారికి నమస్కారం అంటూ వెటకారంగా మాట్లాడిస్తుంది. ఆ తర్వాత సౌందర్య ఆనంద్ రావాలని కూడా వెటకారంగా మాట్లాడిస్తుంది.

Advertisement

ఇక జ్వాలా మాటలకు సౌందర్య, ఆనంద్ రావు హిమ లు లోలోపల బాధపడుతూ పైకి నవ్వుతూ ఉంటారు. ఆటో తోలుకునే నాకు ఈ బహుమతి ఇవ్వడం ఒక గొప్ప అనుకుంటే ఇలాంటి గొప్ప మనుషుల చేతుల మీద అందుకోవడం ఇంకా చాలా గొప్ప.. ఈ బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను అని అనడంతో సౌందర్య వాళ్ళు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతారు.

Advertisement

ఆ తర్వాత జ్వాలా అవార్డును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌందర్య వాళ్లు కార్లో వెళుతూ జ్వాలా అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇక నిరుపమ్ సౌందర్య వాళ్ళని టీవీలో చూసి ఆనంద పడుతూ స్వప్న అని పిలుస్తాడు. అప్పుడు నిరుపమ్ సంతోషంతో జ్వాలాకి కూడా అవార్డు ఇచ్చారు అని అనడంతో వెంటనే రగిలిపోయిన స్వప్న టీవీ ఆఫ్ చేసి నిరుపమ్ పై మండిపడుతుంది.

Advertisement

మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు మన స్థాయికి తగ్గట్టుగా ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేయండి అంటే చేయరు అంటూ నిరుపమ్ పై కోపంగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జ్వాల ఇంటి దగ్గర ఆటోని మొత్తం కోపంతో చిందరవందర చేస్తుంది. మోసం మోసం అంటూ గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సౌర్య తన అమ్మ నాన్నలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇక జీవితంలో వారికి కనిపించను,నా ముఖం వారికి చూపించను అని అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా వూరి విడిచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఇంతలో సౌందర్య వాళ్ళు అక్కడికి వచ్చి మేమందరం ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్లి పోతావు అనడంతో మీరు ఎవరు అని అంటుంది సౌర్య. ఆటో తోలుకుంటుంది, టిఫిన్ బాక్సులు అందిస్తోంది అని తెలిసి కూడా నేనే మీ మనవరాలు అన్న విషయాన్ని బయట పెట్టలేదు అని బాధపడుతుంది సౌర్య.

Advertisement

అప్పుడు సౌందర్య మా విషయం పక్కన పెట్టు కనీసం నువ్వు కూడా మమ్మల్ని నానమ్మ, తాతయ్య అని పిలవచ్చు కదా అని అడుగుతుంది. దాంతో హిమ నేను ఎందుకు పిలవలేదు కారణం ఇప్పుడు చెబుతాను అని చెప్పి తన చేతి పై ఉన్న పచ్చబొట్టుంది చూపిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam: అప్పుల బాధతో టెన్షన్ పడుతున్న శోభ..హిమ,తింగరి ఒకటే అని తెలుసుకున్న శౌర్య..?

Advertisement
Advertisement