Surekha vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిగా, చెల్లిగా, పిన్నిగా వదన పాత్రల్లో నటిస్తూ.. పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇలా వివిధ సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించిన ఈమె.. భర్త మరణం తర్వాత కొద్ది రోజుల పాటు దుఃఖంలో మునిగిపోయింది. ప్రస్తుతం తన కూతురితో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఇకపోతే కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖా వాణి ఇన్ స్టా గ్రామ్ లోకి ఎంటర్ అయింది. కూతురుతో కలిసి వీడియోలు, డ్యాన్సులు చేస్తూ రచ్చ పచ్చ చేస్తుంది. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, పబ్ లకు వెళ్లడం కూడా సాధారణమే. అయితే ఇలా వారు చేసే రచ్చ ఫొటోలు, వీడియోలు నెట్టింట పెట్టి విపరీతమైన ట్రోల్స్ కు గురవుతుంటారు.
తాజాగా సురేఖ వాణి మరోసారి నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యారు. సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు వీడియోలును సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటి నుంచి సురేఖ వాణిపై తిట్ల దండకం మొదలు పెట్టారు. అయితే పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సురేఖ వాణి తన కూతురుతో కలిసి ఏకంగా మద్యం తాగించడం చర్చనీయంశంగా మారింది. ఇది చూసిన ఎంతో మంది నెటిజెన్లు అసలు నువ్వు తల్లివేనా ఇలా తగ్గరుండి కూతరికి మందు తాగిస్తావా అంటూ పెద్ద ఎత్తున ఏకిపారేస్తున్నారు.