Srikrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏడు శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 19న జరుపుకుంటున్నారు. బాల గోపాలుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఇందులో భాగంగానే జన్మాష్టమి పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. కృష్ణుడు వెన్న ప్రేమికుడు. అంతే కాదు పాలతో చేసిన అన్ని ఆహార పదార్థాలను ఇష్టపడతాడు. మీ రాశిని పట్టి బాల కృష్ణుడికి ఎలాంటి భోగాలు అందిచవచ్చో మనం ఇప్పుడు చూద్దాం.
Srikrishna Janmashtami : కృష్ణాష్టమి రోజున ఏ రాశి వారు ఎలాంటి ప్రసాదం సమర్పించాలి..
- మేష రాశి.. మేష రాశి వాళ్లు కృష్ణుడికి ఎర్రటి వస్చ్రంతో అలంకరించిన వెన్న సమర్పించాలి.
- వృషభ రాశి.. ఈ రాశి వాళ్లు కృష్ణాష్టమి రోజున వెన్న సమర్పించాలి దీని ద్వారా దేవుడు వారి అన్ని సమస్యలను తొలగిస్తాడు.
- మిథున రాశి.. ఈ రాశి వాళ్లు కృష్ణుడికి చందనంతో తిలకం వేసి పెరుగు నైవేద్యంగా సమర్పించాలి.
- కర్కాటక రాశి.. ఈ రాశి వాల్లు బాల గోపాలుడిని తెల్లని వస్త్రంతో అలంకరించాలి. ఈ తర్వాత కృష్ణుడికి పాలు, కుంకుమ సమర్పించాలి.
- సింహ రాశి.. జన్మాష్టమి రోజున సింహరాశి వారు కృష్ణుడిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. అష్టగంధ తిలకాన్ని పెట్టి వెన్న-మిశ్రిని సమర్పించాలి.
- కన్యారాశి.. ఈ రాశి వాళ్లు కృష్ణుడిని పచ్చని వస్త్రంతో అలంకరించాలి. మీగడ పాలు అందించాలి.
- తులా రాశి.. ఈ రాశి వాళ్లు కృష్ణుడికి గులాబీ రంగు దుస్తులు వేసి.. నెయ్యి సమర్పించాలి.
- వృశ్చిక రాశి.. ఈ రాశి వాళ్లు శ్రీకృష్ణుడికి ఎర్రని వస్త్రాలు వేసి వెన్న లేదా పెరుగు ధరించాలి.
- ధనస్సు రాశి.. ఈ రాశి వారు జన్మాష్టమి రోజున శ్రీ కృష్ముడికి పసుపు రంగు దుస్తులు వేయాలి. దీని తర్వాత మీగడ పాలు సమర్పించాలి.
- మకర రాశి.. ఈ రాశి వాళ్లు కన్నయ్యను నీలి వస్త్రంతో అలంకరించి పంచదాల మిఠాయిని సమర్పించాలి.
- కుంభ రాశి.. జన్మాష్టమి రోజున ఈరాశి వాళ్లు నీలిరంగు వస్త్ంతో కన్నయ్యని అలంకరించి పెరుగు, పంచదారను సమర్పించాలి.
- మీన రాశి.. ఈ రాశి వాళ్లు పీతాంబరి వస్త్రాలతో అలంకరించాలి. బాల గోపాలుడికి సమర్పించండి.
- Read Also : Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ నాలుగు పనులు చేస్తే సరి..!