Viral News: ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఫుడ్ డెలివరీ సమస్థలు వచ్చిన తరువాత చాలామంది వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసుకుంటూ తింటున్నారు. ఈ క్రమంలోనే తిరువనంతపురానికి చెందిన ఓ మహిళ కూడా తనకు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. అయితే ఆ పరోటాలను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా భయంతో వణికి పోయింది. ఫుడ్ పార్సిల్ లో పాము చర్మం కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్న ఆమె వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
తిరువనంతపురంలో ప్రియా అనే మహిళ ఈ నెల 5న నెడుమంగడు ప్రాంతంలోని ఒక హోటల్ నుంచి పరోటాలు ఆర్డర్ చేసింది. పరోటాలు ఇంటికి రావడంతో వాటిని తన కూతురికి తినిపించింది. తన కూతురికి తినిపించిన అనంతరం తను కూడా తిన్న కొద్ది సేపటికి పరోటాలలో వేలు పొడవు పాము చర్మం కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసిన ఆ మహిళ వెంటనే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
విషయం తెలుసుకున్న ఆహారభద్రత అధికారులు వెంటనే ఆ హోటల్ సందర్శించి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసిన అనంతరం ఆ హోటల్లో పరిశుభ్రత లోపించడం కారణంగా అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. అయితే ఈ విధంగా ఫుడ్ పార్సిల్ లో ఇలాంటివి కనిపించడం మొదటిసారి కాదు ఇప్పటి వరకు ఎన్నో హోటల్ నుంచి ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడంతో పెద్ద ఎత్తున అలాంటి రెస్టారెంట్లను అధికారులు తనిఖీలు నిర్వహించి వాటి లైసెన్స్ రద్దు చేసి హోటల్ సీజ్ చేసిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World