Viral News: సాధారణంగా పిల్లలు చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వారికి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసి వారి పిల్లలను చూడాలనే కుతూహలం ప్రతి ఒక్క తల్లిదండ్రులలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు కూడా తన కొడుకును ఎంతో కష్టపడి చదివించి చదువు కోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేసి అతనిని పైలెట్ చేశారు.పైలెట్ అయిన తర్వాత తన కొడుకు వివాహం కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా 2016వ సంవత్సరంలో ఘనంగా వివాహం చేశారు.
వీరి వివాహం అనంతరం హనీమూన్ కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి తమ తల్లిదండ్రులు తన కొడుకు కోడల్ని థాయిలాండ్ హనీమూన్ పంపించారు.ఈ విధంగా వీరి జీవితం ఎంతో సౌకర్యవంతంగా ఆనందంగా సాగిపోతుంది. ఈ క్రమంలో తన కోడలు తన కొడుకుని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకు వచ్చింది.ఈ విధంగా తన కొడుకు నుంచి తమని వేరు చేయాలని కోడలు కొడుకు పై బలవంతం తీసుకురావడంతో ఏకంగా ఈ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు.
కోర్టులో ఈ తల్లిదండ్రులు వేసిన పిటిషన్ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే..ఏడాదిలోపు తన కోడలు తమ చేతిలో మనవడు మనవరాలు పెట్టకపోతే వారు ఐదు కోట్ల రూపాయలు తల్లిదండ్రులకు చెల్లించాలని కోర్టు ద్వారా తన కొడుకు కోడలకు వార్నింగ్ ఇప్పించారు.చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించి పెద్ద చేసిన తర్వాత కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడిన తన జీవితంపై తన కోడలు నియంత్రణ తీసుకుందని, అలా చేయడమే కాకుండా తమ కొడుకును తన నుంచి దూరం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి తన కొడుకు కోడలు ఏడాదిలోపు పిల్లల్ని కనాలని లేదంటే 5 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World