Viral news: మహిళలు తాము కోడలిగా ఉన్నప్పుడు ఒకలా… అత్తలుగా మారినప్పుడు మరోలా ప్రవర్తిస్తుంటారు. కోడలిగా ఉన్నప్పుడు అత్తలు తమను కూతురిలా చూసుకోవాలని అనుకుంటారు. కానీ అత్తగా మారిన తర్వాత కోడళ్లను పరాయి బిడ్డగానే చూస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే కోడళ్లును కన్న బిడ్డల్లా చూస్తారు. ప్రేమ కురిపిస్తారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ కోడలి పాలిట అత్తామామలు సొంత తల్లిదండ్రులుగా మారారు. ఈ వార్త కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. నిజంగా జరిగిందే. ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వాళ్లు చేసిన గొప్ప పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
మధ్యప్రదేశ్ ధార్ లో జరిగింది ఈ ఘటన. ప్రకాష్ తివారి, రాణిగి తివారి దంపతులకు ఒకే ఒక్క కుమారుడు.అతనికి వివాహం చేశారు. కుమారుడు కోడలు హాయిగా ఉంటున్న సమయంలోనే అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. కరోనా తో గతేడాది ప్రకాష్ తివారి కొడుకు చనిపోయాడు. ఇక కోడలిని వారు కన్న బిడ్డలా చూసుకున్నారు. భర్త లేని కోడలిని ఓ ఇంటి దానిని చేయాలని భావించారు.
కోడలిని కూతురుగా దత్తత తీసుకున్నారు. తర్వాత ఓ అబ్బాయిని చూసి కన్యదానం చేసి వారి గొప్ప మనసు చాటుకున్నారు. కోడల్ని కూతురుగా భావించి ఆమె ఇష్ట ప్రకారం అత్త, మామలే పెళ్లి పెద్దలుగా నిలబడి వివాహం చేసిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.