Viral news: ప్రకృతి చాలా అందమైనది. అలాగే చాలా కఠినమైనది కూడా. ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. అలాగే ఆశ్చర్యపోయే ఘటనలకు వేదికవుతుంది. ఆకాశంలో, నేలపై ప్రకృతి చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి తలచుకుంటే ఏదైనా చేయగలదు అన్న దానికి మరో రుజువు నమోదైంది. తాజాగా జరిగిన ఓ ఘటన పట్ట పగలే చిమ్మ చీకట్లు కనిపించాయి.
అమెరికాలో ఆ రోజు పట్ట పగలు. ఎర్రటి ఎండ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అటు వంటిది ఒక్క సారిగా ఎవరో మంత్రం వేసినట్లు చీకట్లు కమ్మేసింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఆ ప్రదేశాన్ని చుట్టు ముట్టింది. ప్రయాణిస్తున్న వాహనాలన్నీ తమ లైట్లను వెలిగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదండీ ఏదో సినిమాలోని సన్ని వేశం కాదు.
అమెరికాలో జరిగిన ఓ నిజమైన ఘటన. మిట్ట మధ్యాహ్నం కాస్త ఒక్కసారిగా అర్ధరాత్రిని తలపించేంత చీకటిగా మారింది. ఈ ఘటన యూఎస్ లోని అప్పర్ మిడ్ వెస్ట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే గురువారం ఆ ప్రాంతంలో తీవ్రమైన దుమ్ము ధూళితో కూడిన తుపాను వచ్చింది.
తుపాను రాకతో అక్కడి ప్రదేశాన్ని పట్ట పగలే చీకట్లు కమ్మేశాయి. ఆ తుపానులో దుమ్ము ఆకాశాన్ని మందపాటి దుప్పటిలా కమ్మేసింది. దాంతో ఆ ప్రదేశం అంతా కాసేపటి వరకు అర్ధరాత్రిని తలపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ తుపాను కాస్త డెరోకోగా మారింది. డెరోకో అంటే ఉరుములు, మెరుపులు. నీటి జల్లులతో కూడా దీర్ఘకాల తుపాను, వీటి గాలులు కొన్ని సందర్భాల్లో గంటకు 100 మైళ్లు అంత కంటే ఎక్కువ వేగంగా కూడా వీస్తాయి.