Intinti Gruhalakshmi July 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య, సూసైడ్ చేసుకోబోతున్నట్టు నటిస్తూ నందు మల్లి దగ్గర చేసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఉదయాన్నే ఇంట్లో హడావిడి చేస్తూ అంకితకు పనులు అప్ప చెబుతూ ఉండగా అప్పుడు దివ్య సరదాగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో లోన్ తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నాను అని తులసి చెప్పడంతో వెంటనే వాళ్ళందరూ షాక్ అవుతారు.
ఫేక్ డాక్యుమెంట్ పెట్టి డబ్బులు తీసుకోవడంలో మోసపోయాను అని తెలిసి డబ్బులు వాడుకొనే మరొక తప్పు చేయను ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వెళ్తున్నాను అని అనడంతో ఇంతలోనే బ్యాంకు అధికారులు వచ్చి డబ్బులు వసూలు చేసే విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పడంతో వెంటనే తులసి తన స్థాయిలో గట్టిగా సమాధానం చెప్పి పంపిస్తుంది. ఆ తరువాత ఇంట్లో అందరూ తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉండగా అనసూయ మాత్రం లాస్య ఇంత చేసినా కూడా ఏమనకుండా ఉన్నందుకు కోపంతో ఉంటుంది. అప్పుడు అంకిత మాట్లాడుతూ మన ఇంటి పరువు పోకూడదు అని అలా చేసింది అమ్మమ్మ అని చెప్పి తులసికి సపోర్ట్ గా మాట్లాడడంతో అనసూయ అర్థం చేసుకుంటుంది.
Intinti Gruhalakshmi July 6 Today Episode : గాయత్రీకి గట్టిగా బుద్ధి చెప్పిన అంకిత..
ఆ తర్వాత అభి గాయత్రీ తో మాట్లాడుతూ మా మామ్ కి డబ్బులు ఇచ్చిందో లేదో తెలుసుకోమని గాయత్రి ని ఫోన్ చేయమని అనడంతో వెంటనే గాయత్రి ఫోన్ చేసి అసలు విషయాన్ని అడుగుతుంది. ఇక వెంటనే అంకిత గాయత్రి కితన స్టైల్ లో గట్టిగా సమాధానం చెబుతుంది. మా అత్తయ్య తన కష్టపడి తానే డబ్బులు కట్టింది అనడంతో గాయత్రీ ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత అంకిత అభిని ఉద్దేశించి మాట్లాడడంతో అవి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత తులసికి సంజన ట్యూషన్ డబ్బులు ఇస్తుంది. అప్పుడు తులసి సంజనను తన కొడుకు ప్రేమ్ కు సంగీతం కాంపిటీషన్లో అవకాశం ఇవ్వమని కోరడంతో అందుకు సంజన ఓకే అనడంతో తులసి సంతోషపడుతూ నేరుగా ప్రేమ్ ఇంటికి వెళ్తుంది. తులసీ తన ఇంటికి రావడంతో శృతి ఆనందంగా ఉంటుంది. అప్పుడు ప్రేమ్ రాకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది తులసి.
అప్పుడు ప్రేమ్ కు పాటల పోటీల ఇంటర్వ్యూ ఫామ్ ఇవ్వమని శృతికి ఇస్తుంది. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా పాటలు ప్రాక్టీస్ చేయమని సలహా ఇస్తుంది. కానీ ప్రేమ్ ఇందులో పాల్గొన్నడు అని చెప్పాడు ఆంటీ అని చెప్పడంతో తులసి షాక్ అవుతుంది. ఇంతలోనే ప్రేమ్ ఇంటికి రావడంతో తులసి తలుపు వెనకాల దాక్కుంటుంది. ఆ తర్వాత శృతి ప్రేమ్ కి ఇంటర్వ్యూ లెటర్ ఇవ్వడంతో ప్రేమ్ తనకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కోపంగా బయటికి వెళ్తూ ఉండగా ఇంతలో తులసి పాట పాడడంతో రేయ్ మళ్లీ లోపలికి వచ్చి ఇది అమ్మ పాడిన పాట కదా అని అంటాడు. అప్పుడు శృతి అవును ఆ పాట నేను నీకోసం పాడాను అని అనడంతో వెంటనే ప్రేమ నేను ఈ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటాను అని అనడంతో తులసి సంతోష పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?