Samantha shocking news: ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులతో మరింత పాపులర్ అయింది. విడాకుల తర్వాత కెరియర్ పరంగా దూసుకెళ్తోంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. బాలీవుడ్ లోనూ అవకాశాలను చేజిక్కించుకుటుంది.
సమంత గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఆమె మీద నెగటివ్ టాక్ ఎక్కువగా ఉండటం వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండమని ఓ డైరెక్టర్ సూచించడంతో ఆమె ఈ పి చేస్తోందట. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే… సమంత సర్జరీ చేయించుకొని గర్భసంచి తీయించుకుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం చై అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
నాగ చైతన్య తప్ప తాను ఇంకెవరినీ పెళ్లి చేస్కోనని.. రెండో పెళ్లి వంటి అంశాలు తన వద్దకు తీసుకురావద్దంటూ కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందట. కానీ కుటుంబ సభ్యులు ఆమెకు రెండో పెల్లి చేయాలనుకోవడంతో ఆమె ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది మాత్రం తెలియాల్సి ఉంది.