Samantha Birthday : సమంత పుట్టినరోజు అంటే.. మామూలుగా ఉండదు.. అందుకే మూవీ యూనిట్ సామ్‌కు స్సెషల్ బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. ఈ రోజు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు అంట.. ఆ విషయం తెలిసిన మూవీ యూనిట్ సమంతకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా కొత్త మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం దేవరకొండ మూవీ షూటింగ్ కశ్మీర్ లోయలో జరుపుకుంటోంది.
సమంత పుట్టినరోజున సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. సమంతకు తెలియకుండా ఒక ఫేక్ సీన్ రాశారు. ఆమెతో రిహార్సల్స్ చేయించారు. అదంతా షూటింగ్ అని భావించిన సమంత విజయదేవరకొండతో ఫేక్ సీన్‌లో నటించింది. అంతలోనే విజయ్.. ఒక్కసారిగా సామ్ అంటూ పిలుస్తాడు. అదేంటీ రియల్ నేమ్ తో పిలిచాడని సామ్ ఆశ్చర్యపోయింది.
వెంటనే విజయ్.. హ్యాపీ బర్త్ డే సామ్ అనేసరికి సమంత కంగుతిన్నది.. చిత్రయూనిట్ కూడా హ్యాపీ బర్త్ డే సామ్ అంటూ విషెస్ చెప్పారు. సామ్ పట్టరాని సంతోషంతో అందరికి థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత సమంతతో బర్త్ డే కేక్ కట్ చేయించింది చిత్రయూనిట్. సమంత బర్త్ డే వేడుకలకు సంబంధించి చిత్రయూనిట్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.