...

Samantha new movie: వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

Samantha new movie : టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ సమంత వరసు ఆఫర్లతో దూసుకెళ్తుంది. చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. వచ్చిన ప్రతీ ప్రాజెక్టుకు సంతకం పెడ్తూ… తన టాలెంట్ ని నిరూపించుకుంటోంది. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాతే సామ్… పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఇక శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత… ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిష్, హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. తాజాగా మరోసారి కొత్త ప్రాజెక్కటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Samantha new movi
Samantha new movi

ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు సామ్ ఇంప్రెస్ అయిపోయిందట. వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమా డైరక్టర్, ప్రొడ్యూసర్స్ గురించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట మూవీ మేకర్స్. అయితే సామ్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా వినిపిస్తుడటంతో… డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ ఎరంటూ నెట్టింట్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే ఈ విషయాల గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Read Also : RRR Movie : ఆర్ఆర్ఆర్ ఓటీటీ ప్రమోషన్లో భాగంగా నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన దీప్తి సునయన దేత్తడి హారిక.. వీడియో వైరల్!