...

RRR దెబ్బకు వార్ వన్ సైడ్.. వచ్చే ఏడాది వరుసగా మూడు నెలల వరకు పండగే..

RRR Movie Release Date : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది. గతంలో ఎన్టీయార్‌కు పోటీగా ఏఎన్‌ఆర్, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవి కూడా సంక్రాంతి, దసరా సమయంలో థియేటర్లకు వచ్చి నువ్వా నేనా అన్నట్టు నడిచేవి. ఆ తర్వాత చిరు, బాలకృష్ణ సినిమాలు నడిచాయి. కానీ ప్రస్తుతం ఆ పోటీతత్వం తెలుగు చిత్రపరిశ్రమలో కనిపించడం లేదు.

ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదల అవుతుందనుకుంటే తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు చిన్న హీరోలు. కారణం నిర్మాతలకు పట్టుకున్న భయమే. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదలైతే లాభాలు రావడం ఏమో గానీ నష్టాల పాలు కావాల్సి వస్తుందని తెగ భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ నుంచి కోలుకుంటున్న సమయంలో వారు రిస్క్ చేయదలుచుకోవడం లేదని తెలిసింది.

ఈ క్రమంలోనే రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న RRR మూవీ విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. సంక్రాంతి బరిలో ఉండవచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. జనవరి 7న ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్య మూవీని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు చిత్రబృంద్రం ప్రకటించింది. అదే విధంగా వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వస్తున్న `ఎఫ్ 3`ను కూడా అదేనెల 24న విడుదల చేయనున్నట్టు తెలిసింది.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ మార్చి 31న విడుదలకు సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ చిత్రం `సర్కారు వారి` పాట ఏప్రిల్ 28న థియేటర్ల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. నిజానికి మహేశ్ బాబు సినిమా సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉండగా.. ఆర్ఆర్ఆర్ దెబ్బకు అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకున్నట్టు తెలుస్తోంది.

Read Also : Kota Srinivasa Rao : బాబుమోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ‘కోట శ్రీనివాస్ రావు’.. ఆ రోజు వాడు అలా చేయకపోతే నన్ను ఎంతోమంది తిట్టుకునేవారు..!