Guppedantha Manasu November 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార రిషి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు..
ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ధరణి అక్కడికి వచ్చి రిషి నీ ఫోన్ వచ్చింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోగా వెంటనే రిషి తడి జుట్టుతో ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది అని వసుధార చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి బయటకు వచ్చి సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు జగతి దంపతులు మినిస్టర్ ని కలవడానికి రెడీ అవుతూ ఉంటారు.

మరొకవైపు వసుధార రెడీ అవుతూ జరిగిన విషయాన్ని తలుచుకుని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తనకు తానుగా మాట్లాడుకుంటూ ఉంటుంది వసుధార. ఆ తర్వాత మినిస్టర్ దగ్గరికి వెళ్తారు వసుధార రిషి. అక్కడ జగతి మహేంద్రలు మినిస్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర వాళ్ళు చాలా ప్రదేశాల నుంచి ఉత్తరాలు వచ్చాయి.
అందుకే మేము పర్సనల్ గా వెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం మా పనులన్నీ వసుధారకు ఇస్తున్నట్లు లెటర్ ని మినిస్టర్ కి ఇస్తారు. ఆ తర్వాత వారిద్దరు ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే వసుధార, రిషి అక్కడికి రావడంతో వాళ్లను చూసి జగతి దంపతులు దాక్కుంటారు.
Guppedantha Manasu నవంబర్ 7 ఎపిసోడ్ :వసుధార, రిషి షాక్..
అప్పుడు రిషికి మహేంద్ర అక్కడే ఉన్నట్టు అనిపించడంతో వెంటనే వెనక్కి వెళ్లి చూడగా అక్కడ లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు మినిస్టర్ గారి క్యాబిన్ లో ఉన్నారేమో అని అక్కడికి వెళ్లి అడగగా ఇప్పుడే వెళ్లిపోయాడు అని చెబుతాడు మినిస్టర్. అప్పుడు రిషి జగతి దంపతుల కోసం పరిగెడుతూ బయటికి వెళ్లి చూడగా అక్కడ జగతి వాళ్ళు కనిపించకపోయేసరికి బాధపడుతూ ఉంటాడు. అది చూసిన జగతి దంపతులు మరింత బాధ పడుతూ ఉంటారు.
ఆ తర్వాత మళ్లీ రిషి మినిస్టర్ క్యాబిన్ కి వెళ్తాడు. ఆ తర్వాత మినిస్టర్ జగతి దంపతులు వసుధారకి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని రిషి కి చెబుతారు. దాంతో వసుధార రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత జగతి దంపతులు ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు అని తెలుసుకొని వసుధార వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు.