Guppedantha Manasu Dec 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతి మహేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి టెన్షన్ పడుతూ ఉండగా మహేంద్ర ఎందుకు నువ్వు చిన్న చిన్న దానికి భయపడుతున్నావు ఎందుకు నీలో ఈ భయం ప్రవేశించింది అని అడగగా వాళ్లు ఇద్దరు కలిసి పోవాలని మనం ఎంతగా తాపత్రయపడ్డామో వాళ్ళు కూడా అలాగే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంతగా కలిసిపోయారు. కానీ ఇప్పుడు దేవయాని అక్కయ్య పెళ్లి వద్దు అంటూ ఏవేవో ప్లాన్లు చేస్తుంది అందుకే టెన్షన్ గా ఉంది మహేంద్ర అని అంటుంది జగతి.. నువ్వేం భయపడకు ఇదివరకటిలాగా లేము కదా వదిన ఏమైనా ప్లాన్ చేస్తే ఊరికే ఉంటామా అని అంటాడు మహేంద్ర.

మరొకవైపు దేవయాని రాజీవ్ కి ఫోన్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది చేసావా లేదా ఈ దేవయాని తప్పకుండా గెలవాలి అనడంతో తప్పకుండా మీరు గెలుస్తారు నేను కూడా గెలుస్తాను మేడం అని రాజీవ్ దేవయానితో వారి ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని మాటలు కాదు చేతల్లో చూపించు అని అంటుంది. అప్పుడు ఈ రాజీవ్ ని తక్కువ అంచనా వేయొద్దు నేనేంటో చూపిస్తాను వసుధార మెడలో తాళి కడతాను అని అంటాడు రాజీవ్. మరొకవైపు వసుధార, రిషి ఒక చోటికి వెళ్లగా అప్పుడు వసుధార తన ఇంటికి బయలుదేరుతుంది.
అప్పుడు రిషి సంతోషంతో ఇంకా కొన్ని గంటలే మన మధ్య ఏ దూరం కదా అనడంతో ఆ సమయం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను సార్ అని అంటుంది.. ఈ మొబైల్ నీకోసమే తీసుకో వసుధార అని అనడంతో ఆ మొబైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు చక్రపాణి వసుధార కోసం ఇంటి గుమ్మం ఎదురుగా కూర్చుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడికి వచ్చి ఇంట్లోకి వెళుతుండగా అక్కడే ఆగు ఎవడే వాడు అని అనడంతో నాన్న మర్యాద అని అంటుంది. చెప్పు ఎవడు వాడు ఆనందం నాకు కాబోయే భర్త అని అనగా చక్రపాణి సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు.
ఆవేశపడకండి నేను చెప్పే జాగ్రత్తగా వినండి మేమిద్దరం ఇష్టపడ్డాము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాను వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అని అంటూ చక్రపాణి షాక్ అవుతాడు. ఎలా పెళ్లి చేసుకుంటావు అనడంతో నా పెళ్లి నా ఇష్టం అని అంటుంది వసుధార. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మంచి ముహూర్తం చూసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మ పంచాంగం చూసి ఒక ముహూర్తం చెబితే వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్తారు పద్ధతిగా నే మాట్లాడగలుగుతారు అని అంటుంది. రిషి సార్ డైమండ్ రిషి సార్ ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని వసుధార తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు రిషి వసుధర తిరిగిన ప్రదేశాలకు వెళ్లి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార కొత్త ఫోన్ చూసుకుంటూ దాంట్లో రిషి ఫోటోలు చూసి మురిసిపోతూ ఉండగా ఇంతలో సుమిత్ర అక్కడికి వచ్చి మీ నాన్న మాట వినొచ్చు కదా అనడంతో అమ్మ నాన్న మొండితనం గురించి మనందరికీ తెలిసిందే కదా ఇలా గట్టిగా మాట్లాడితే నాన్న అసలు ఒప్పుకోడు ఒకసారి నువ్వు కూడా నా కోసం గట్టిగా ప్రయత్నం చేయమ్మా ఇలా ఆలోచించకపోతే నా జీవితం కూడా అక్కవాలో జీవితం లాగే అయిపోతుంది అని అంటుంది. అప్పుడు రిషి ఫోటో చూపించడంతో మహారాజులా ఉన్నాడు అని అంటుంది సుమిత్ర.
ఆ తర్వాత రిషి దేవయానికి ఫోన్ చేసి పెద్దమ్మ హాల్లో ఉన్నారా అయితే అందర్నీ ఒకసారి పిలవండి అనడంతో ధరణి పిలుచుకుని వస్తుంది. అప్పుడు అందరూ అక్కడికి రావడంతో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ వసుధార ఏ క్షణమైనా రమ్మని చెప్పవచ్చు అందరూ రెడీగా ఉండండి అనడంతో దేవయాని షాక్ అవ్వగా అందరూ సంతోషపడుతూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu Dec 28 Today Episode : వసు కొట్టబోయిన చక్రపాణి.. టెన్షన్ పడుతున్న జగతి, మహేంద్ర?