Sridevi drama company: బుల్లితెరపై కనిపించే రవికృష్ణ పేరు వినగానే మనకు నవ్య స్వామి కూడా గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు రవికృష్ణ అంటే గోరింటాకు కావ్య గుర్తొచ్చేలా చేశాడీ సీరియల్ హీరో. ఇందుకు కారణం… కావ్యతో కలిసి రవికృష్ణ రొమాంటిక్ డ్యాన్స్ చేయడం. శ్రీదేవి డ్రామా కంపెనీలో రవికృష్ణ, కావ్యతో ఓ డ్యాన్స్ చేశాడు. ఇందులో డ్యాన్స్ కంటే కూడా రొమాన్స్ యే ఎక్కువగా ఉంది. ఆమెను అక్కడా ఇక్కడా పట్టుకుంటూ, పైకెత్తుకొని మరీ స్టెప్పులు వేశాడు. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
తాజాగా రిలీజ్ చేసిన శ్రీ దేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ప్రోమోలో వీరి రొమాంటిక్ డ్యాన్స్ ఉంది. చీరకట్టులో కావ్య మత్తెక్కించేలా చూస్తూ… సెట్లో ఉన్న వారందరికీ సెగలు పుట్టించింది. అయితే రవి కృష్ణ, నవ్యస్వామిని, కావ్య ఆ సీరియల్ హీరోని వదిలేసి… వీరిద్దరూ జంట కట్టడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు నవ్య స్వామితో కాకుండా రవికృష్ణ ఈ అమ్మాయితో రొమాన్స్ చేయడం ఏంటంటూ పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో డ్యాన్స్ అదిరిపోయిందని చెప్తున్నారు.