Rashmika Mandanna : లక్కీ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా సీతారామం సక్సెస్ లో భాగమైన ఈమె.. మూవీ సక్సెస్ ని ఆస్వాదిస్తోంది. యితే రష్మిక గత కొంత కాలంగా విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యమే విజయ్ దేవరకొండ బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహన్ తన షోలో రష్మికని విషయం అడగ్గా… తాను నా డార్లింగ్ అంటూ సమాధానం చెప్పాడు. ఇద్దరం ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశామని, వరసగా రెండు సినిమాల్లో నటించడం వల్ల మంచి స్నేహితులుగా మారామని వివరించాడు.
మరోవైపు రష్మిక కూడా తాము బెస్ట్ ప్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. తాజాగా రష్మికని బాలీవుడ్ మీడియా విజయ దేవరకొండతో డేటింగ్ విషయమై ప్రశ్నించింది. విజయ్ దేవరకొండతో కలిసి డేటింగ్ చేస్తున్నారంటా అని అడగ్గా… దాని రష్మిక నేనొక హీరోయిన్ ని అని.. ఏడాదికి నాలగైదు సినిమాలు చేస్తాను.. మీరూ నేను చేసే సినిమాల గురించి అడగొచ్చు.. కానీ న బాయ్ ఫ్రెండ్ ఎవరు, నువ్వు ఎవరితో డేటింగ్ చేస్తున్నార్ వంటివి అడగడం ఎందుకంటూ ప్రశ్నించింది. తాను చెప్పే వరకు అలాంటి వార్తలను సీరియస్ గా తీస్కోవద్దంటూ చెప్పింది. చదివి ఎంజాయ్ చేసే వారిని ఎంజాయ్ చేయనివ్వండి అంటూ ఆసక్తికరంగా స్పందించింది.
Read Also : Sri Reddy Video : గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా ఉంటే.. మీకేంటి నొప్పి.. బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. వీడియో