Deepa Reentry: బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియల్స్ లో కార్తీక దీపం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటలక్క, వంటలక్క అంటూ లక్షలాది మంది ఆ సీరియలన్ ను ప్రతినిత్యం చూసేవాళ్లు. కానీ వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లను తీసేసినప్పటి నుంచి ఈ సీరయల్ టీఆర్పీ పడిపోయింది. అప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఏళ్ల పాటు సాగిందీ కార్తీకదీపం. అయితే వంటలక్క లేకపోతే సీరియలే వేస్ట్ అంటూ, ఎలాగైనా సరే దీప క్యారెక్టర్ ను మళ్లీ తీసుకరావాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అలాంటి వాళ్ల కోసమేనేమో వంటలక్క కార్తీకదీపంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రేమి విశ్వనాథ్ షేర్ చేసిన వీడియోనను చూస్తే ఆమె కార్తీక దీపం సీరియల్ లో మళ్లీ కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వంటలక్క తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకుంది. అందులో కార్తీకదీపం సీరియల్ పాత్ర లాగా రెడీ అవుతున్నట్లు కనిపించగా… వెంటనే తన అసిస్టెంట్ వచ్చి దీప మేడం షాట్ రెడీ అని చెప్తాడు. వస్తున్నా అంటూ వంటలక్క గెటప్ లో దీప ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ వీడియో కింద మీకోసమే అని క్యాప్షన్ ఇవవ్డంతో.. అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా వంటలక్క మళ్లీ వచ్చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి వంటలక్క వస్తే డాక్టర్ బాబు కూడా రావాలి కదా. మరి డాక్టర్ బాబు రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement