Beauty tips: ముఖం మీద నల్లటి మచ్చలు, మొటిమలు, టాన్ చేరిపోయి ముఖమంతా నల్లగా తయారవుతుంటుంది చాలా మందికి. చూసేందుకు కూడా అంద వికారంగా ఉంటుంది. వాటిని తగ్గించుకనేందుకు చాలా మంది తెగ కష్టపడిపోతుంటారు. వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ రకరకాల ఫేస్ క్రీములు వాడుతుంటారు. అయితే అలాంటివేం అవసరం లేకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేస్కోవచ్చు. కాస్త ఓపిక, శ్రద్ధ ఉండాలే కానీ ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేస్కోవచ్చు. దీని వల్ల మొహం తెల్లగా మారడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది. అయితే ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాగా పండిన ఒక అరటి పండు తొక్కను తీస్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్కోవాలి. ఒక గిన్నెలో 200ఎం,ఎల్ వాటర్ పోసి దాంట్లో అరటి పండు తొక్క ముక్కులు, ఒక స్పూన్, బియ్యం వేసి ఉడికించాలి. కొంచెం చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పేస్టులాగా తయారు చేస్కోవాలి. దీంట్లో స్పూన్ కార్న్ ఫ్లోర్, స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్పూల్ మిల్క్ పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని మొహానికి రాసి 10 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి. తెల్లగా మెరిసే పోయే ముఖం మీ సొంతం అవుతుంది.