Daggubati rana: టాలీవుడ్ హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నిర్మాతగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో… కొడుకు కూడా నటన పరంగా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు రానా నటనకి వంజలు పెట్టిన వారు లేరు. హీరో అయినా, విలన్ అయినా, రౌడీ అయినా, లవర్ అయినా… క్యారెక్టర్ ఏదైనా రానా రంగంలోకి దిగాడంటే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. అలాంటి పర్ఫామెన్స్ రానా దగ్గుబాటి సొంతం. బాహుబలి సినిమాలో విలన్ గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో ప్రభాస్ కంటే కూడా రానాకే ఎక్కువ పేరు వచ్చింది.
అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన విరాట పర్వం సినిమా విషయంలోనూ అంతే. రానా నటన తీరు అందరినీ మెప్పించింది. కమర్షియల్ హిట్ కాలేదు కానీ… నటన పరంగా మాత్రం రానా హిట్ కొట్టాడు. ఇప్పటికే రానా డైరెక్టర్ గుణ శేఖర్ తో హిరణ్య కశ్యప దర్శకుడు మిలింద్ రావుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. అభిమానలకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇకపై సోషల్ మీడియాలో కనిపించను అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఇది శాశ్వతంగా కాదులెండి. కేవలం చిన్న బ్రేక్ నే అని కూడా చెప్పుకొచ్చాడు. పని జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నా. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్.. బెటర్.. స్ట్రాంగర్.. అంటూ రానా తనదైన స్టైల్ లో ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చాడు.