Daggubati rana: దగ్గుబాటి రానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత విలన్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరోగా కంటే కూడా విలన్ గానే రానా ఎక్కువ సక్సెస్ సంపాదించాడు. అయితే బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో ఆయన నటకు వందకు వంద మార్కులు పడ్డాయి. అయితే ఇటీవలే ఆయన విరాట పర్వం చిత్రంలో నటించారు. ఇందులో ఆయన నటన బాగున్నప్పటికీ… కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేదు.
అయితే తాజాగా రానా ఓ బాంబు పేల్చారు. కొన్నాళ్ల పాటు ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణం ఆయన భార్య మిహిక. వరసు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రామా… ఆమెకు కొంచెం కూడా టైం కేటాయించలేకుపోతున్నాడట. అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకొని పూర్తిగా తన భార్యకే సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన.. ఓ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దానికోసం రానా ఏకంగా 20 కోట్లు వదులుకున్నట్లు మరో వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.