RamaRao On Duty Movie Review : మాస్ మహారాజా వచ్చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ అంటూ జూలై 29న థియేటర్లలోకి వచ్చేశాడు. మూవీ రిలీజ్‌కు ముందు ట్రైలర్ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనివిధంగా రవితేజ మొదటిసారి కొత్త రోల్ చేశాడు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ కాగానే మంచి హిట్ టాక్ అందుకుంది. ఇంతకీ రవితేజ రామారావుగా డ్యూటీ బాగానే చేశాడో లేదో తెలియాలంటే వెంటనే రివ్యూలోకి వెళ్లాల్సాందే.
స్టోరీ : విశ్లేషణ :
1995 సంవత్సరంలో రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) అంటూ ప్రారంభమవుతుంది. బి.రామారావు (రవితేజ) సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. చట్టానికి లోబడి తన విధులను నిర్వర్తిస్తుంటాడు. అనుకోని కారణాల రీత్యా.. రామారావు కలెక్టర్ పదవిని కోల్పోతాడు.. ఆ తర్వాత తహశీల్దార్‌గా సొంత గ్రామానికి బదిలీగా వెళ్తాడు. తన ఉరి ప్రజలు తప్పిపోయారని తెలిసిన రామారావు ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో రామారావు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది స్టోరీ..
మూవీ నటీనటులు వీరే :
హీరోగా రవితేజ, రజిషా విజయన్, దివ్యషా కౌశిక్, వేణు తొట్టెంపూడి (ప్రత్యేక పాత్ర), నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, సురేఖ వాణి తదితరులు నటించారు. డైరెక్టర్ శరత్ మండవ మూవీకి దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, RT టీమ్‌వర్క్స్ ద్వారా SLV సినిమాస్ LLP బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Movie Name : | Ramarao On Duty (2022) |
Director : | శరత్ మండవ |
Cast : | రవితేజ, రజిషా విజయన్, నాసర్, వేణు తొట్టెంపూడి |
Producers : | విజయ్ కుమార్ చాగంటి, సుధాకర్ చెరుకూరి |
Music : | సామ్ C S |
Release Date : | 29 జులై 2022 |
వాస్తవానికి రామారావు ఆన్ డ్యూటీ మూవీ.. రవితేజకు కొత్త ప్రయత్నమని చెప్పాలి. ఎప్పుడూ మాస్ మసాలా కమర్షియల్, తన మార్క్ కామెడీతో సందడి చేసే రవితేజలో కొత్త కోణాన్ని చూడవచ్చు. రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ప్రేక్షకులు ఒక కొత్త రవితేజ చూడవచ్చు. దర్శకుడు శరత్ మండవ రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో అద్భుతంగా చూపించాడు. రవితేజ ఇంటర్ డెక్షన్ అదిరిపోతుంది. అక్కడి నుంచే సినిమా మొదలవుతుంది. సినిమా మొదటి నుంచే అసలు కోర్ పాయింట్‌ను ఏంటో ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు. ఇదే ప్రేక్షకుడికి స్టోరీతో కనెక్టవిటీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ చూస్తే.. ఊరి ప్రజలు కనిపించకపోవడం.. వారికోసం రామారావు ఆన్ డ్యూటీ ఎలా చేశాడనేది సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటుంది.
RamaRao On Duty Movie Review : రవితేజ ఒన్ మ్యాన్ ఆర్మీ.. కొత్త రవితేజను చూడొచ్చు..
ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చింది. సెకండాఫ్ ఏమౌతుందనే ఉత్సాహం ప్రతి ప్రేక్షకుడిలో రేకితిస్తుంది. పాటల విషయానికి వస్తే.. అవసరం లేని చోట పాటలు జొప్పించారని అనిపిస్తుంది. సందర్భం లేకుండా సీన్ల మధ్య పాటలు వస్తుంటాయి. ఇదక్కటే సినిమాలో మైనస్.. మిగతా స్టోరీ ఊహించని మలుపులు, పలు ట్విస్ట్‌లతో సినిమా ముందుకు సాగుతుంది. స్క్రీన్‌ప్లే బాగా వర్కౌట్ అయింది. ప్రేక్షకుడిలో బోర్ ఫీల్ లేకుండా ఉంటుంది. క్లైమాక్స్ ఇంకా ఆసక్తికరంగా ఉంటే బాగుండు అనిపించింది. శరత్ మండవ తన రచనతో మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. తాను అనుకున్నట్టుగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా బాగానే చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కట్టిపడేయంలో శరత్ మండవ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
మాస్ కమర్షియల్ మూవీలు చేసే రవితేజ ఇలాంటి మూవీకి ఓకే చెప్పినందుకు మెచ్చుకోవచ్చు. ఈ మూవీలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. రామారావుగా రవితేజ అద్భుతంగా డ్యూటీ చేశాడు. లుక్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్ తగినట్టుగా ఉంది. మలయాళీ నటి రజిషా విజయన్ తన పాత్రకు తగినంతగా నటించింది. ఇందులో మరో నటి దివ్యషా కౌశిక్ పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి మళ్లీ సినిమాల్లో నటించాడు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా రీఎంట్రీ అదిరింది. వేణు తన రోల్ అద్భుతంగా చేశాడు.
మిగతా నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా చూస్తే.. రామారావు ఆన్ డ్యూటీ నాచ్ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వచ్చింది.విలేజ్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్లు బాగా వచ్చాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్‌లో మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. మాస్ ప్రేక్షకులు కోరుకునే విధంగా రామారావు ఆన్ డ్యూటీ ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ప్రతిఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి చూడాల్సి సినిమా.. ఈ మూవీలో రామారావుగా రవితేజ డ్యూటీ సరిగానే చేశాడా లేదో తెలియాలంటే అందరూ థియేటర్లలోకి వెళ్లి చూడాల్సిందే.
[ Tufan9 Telugu News ]
రామారావు ఆన్ డ్యూటీ :
మూవీ రివ్యూ & రేటింగ్ : 3.88/5
Read Also : Ramarao On Duty First Review : రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఫస్ట్ రివ్యూ..