Devatha july 22 today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య దేవుడమ్మ దగ్గరకు వచ్చి ఆదిత్య ప్రవర్తన గురించి చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సత్య బాధపడుతూ ఆదిత్య ఏ విషయంలోనూ చాలా బాధపడుతున్నాడు. ఏమి ఎందుకు అడిగితే ఏమి చెప్పడం లేదు అని దేవుడమ్మతో చెప్పుకొని బాధపడుతుంది. దానితో కంగారు పడిన దేవుడమ్మ వెంటనే ఆదిత్యను పిలిపిస్తుంది. ఏమైంది ఆదిత్య మనిషి మాత్రమే ఇంట్లో ఉన్నావు ఆలోచనలను ఎక్కడ ఉన్నాయి అని అనగా దేవుడమ్మని ఏమీ అనలేక సత్య పై ఎవరు ఏమైపోయినా నీకు అమెరికాకు వెళ్లాలా అంటూ సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

Devatha july 22 today Episode
ఇక ఆదిత్య ప్రవర్తనతో వారందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు సత్య బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు మాధవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే దేవి అక్కడికి వస్తుంది. మా సొంత నాయన వదిలేసిన నువ్వు మమ్మల్ని పెంచి జాగా ఇచ్చావు అని పొగుడుతూ ఉండగా ఆ మాటలు విన్న రాధ ఆశ్చర్యపోతుంది. అప్పుడు దేవి మాధవని థ్యాంక్స్ సారు అనడంతో వెంటనే మధువా అలా ఎప్పుడూ అనకమ్మా నేను మీ నాన్నని అనడంతో రాధ కోపంతో రగిలిపోతుంది.
Devatha july 22 today Episode : ఆదిత్య, సత్య ల మధ్య రుక్మిణి సంఘర్షణ…
అప్పుడు మాధవ మాటలు నిజం అని నమ్మిన దేవి ఆ కసాయి వాడిని విడిచిపెట్టెను అంటూ కోపంతో రగిలిపోతుంది. అది చూసిన రాధ కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మాధవ దేవికి కళ్ళు మూసుకోమని చెప్పి దేవి చెస్ కాంపిటీషన్లో గెలిచిన సందర్భంగా చిన్న పార్టీని అరేంజ్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చి ఆనందంగా పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మాధవని చూసిన రాధ కోపంతో రగిలిపోతూ దేవికి కేక్ పీస్ తినిపించి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ఆదిత్య రాధకు కు పదేపదే ఫోన్ చేస్తున్న కూడా రాధ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటుంది. దాంతో ఆదిత్య ఏం జరిగిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రాధా దేవి అన్న మాటలను తలుచుకొని జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే దేవి నిద్రలో మాధవ అన్న మాటలనే గుర్తు తెచ్చుకొని మా నాయనని వదిలేది లేదు అని అంటూ ఉండగా అప్పుడు రాధ బాధతో మరింత కుమిలిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత రాధ బయటకు వచ్చి ఏడుస్తూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వస్తాడు. అప్పుడు మాధవ మాటలకు రాధ అక్కడి నుంచి లేచి రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మరొకవైపు సత్య ఆదిత్య అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య తనపై సీరియస్ అవ్వడంతో ఆ విషయం గురించి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే కమల అక్కడికి వచ్చి చర్చకు ధైర్యం చెబుతూ ఆదిత్యకు అర్థమయ్యే విధంగా చెప్పమని చెబుతుంది. బాగా ఆలోచించిన సత్య ఆ తర్వాత రుక్మిణి ఇంటికి వెళుతుంది.
Read Also : Devatha july 21 today episode : దేవి మాటలకు కుమిలిపోతున్న రాధ.. మాధవను కొట్టబోయిన రాధ..?