Racha ravi: బుల్లితెరపై లేడీ గెటప్స్ తో అదరగొడ్తూ.. కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ఛమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లతో సినిమాల్లో నటించిన ఇతను జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా మారాడుయ స్పెషల్ స్కిట్లు, కంటెంట్, పర్ఫామెంన్స్ తో బుల్లితెరపై తనదైన ముద్ర వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఛమ్మక్ చంద్ర తన డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.
మన ఊరి రంగస్థలం అనే పేరుతో రాబోతున్న ఓ స్పెషల్ ప్రోగ్రాంలో ఛమ్మక్ చంద్ర డ్యాన్స్ చేశాడు. జీ తెలుగులో ఈ షో ప్రసారం కాబోతుంది. అయితే ఇందులో చంద్ర లేడీ గెటప్ వేస్కొని మరీ నృత్యం చేశాడు. చంద్ర సెట్స్ స్టేజ్ ఆన్ ఫైర్ అంటూ నిర్వాహకులు ప్రోమోను రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబుతో కలిసి చమ్మక్ చంద్ర స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత చమ్మక్ చంద్ర గురించి చెబుతూ రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు.
![YouTube video](https://i.ytimg.com/vi/Q5dOcNuaCwU/hqdefault.jpg)
చంద్రన్న తనకు అవకాశం ఇవ్వకపోతే.. తాను ఇక్కడ ఉండే వాడిని కాదన్నాడు. అనంతర చంద్ర కాళ్లపై పడి నమస్కారం చేశాడు. జబర్దస్త్ షోలో రచ్చ రవిచి చమ్మక్ చంద్రనే అవకాశం కల్పించాడు. ఇద్దరూ కలిసి కొన్ని వందల స్కిట్లు చేశారు. రచ్చ రవి టీమ్ లీడర్ అయిన తర్వాత చంద్ర హెల్స్ చేశాడు. అందుకు కృతజ్ఞతగా చంద్ర కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.