...

Puri jagannath: పూరి జగన్నాథ్ డాటర్ ఎంట్రీతో.. ఛార్మి పరిస్థితి ఏంటో?

Puri jagannath: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సొంతంగా తానే ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి తన బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఛార్మి ఉ్న సంగతి మన అందరికీ తెలుసు. ఈ ఇద్దరి కాంబో బాగా సెట్ అయింది. ఛార్మి భాగస్వామ్యం పూరికి బాగా కలిసి వచ్చింది. తాజాగా ఈ బ్యానర్ లోకి పవిత్ర పూరి ఎంటర్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూరి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఛార్మి తప్పుకోబోతున్నారా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని క్రేజీ హీరోయిన్ ఛార్మి చూసుకుంటుంది. పూరి చేస్తున్న ప్రతీ సినిమాకి ఛార్మినే ప్రొడక్షన్ వర్క్ చేస్తోంది. అయితే ఇక ఈ ప్రొడక్షన్ వర్క్ లోకి పూరి తనయ పవిత్ర పూరి ఎంటర్ కాబోతోందట. పవిత్రను నిర్మాత చేయాలనే ఆలోచనలో ఉన్న పూరి జగన్నాథ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే దీంతో త్వరలోనే పూరి కనెక్ట్స్ బాధ్యతలను పవిత్రకి అప్పజెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే ఛార్మితో కలిసి సినిమా ప్రొడక్షన్ విషయమై ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనుందన్నమాట పూరి డారట్ పవిత్ర. అయితే ట్రైనింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారా.. లేక ఛార్మిని తప్పించేందుకు భాగమే ఈ ప్లాన్ అనే అనుమాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఏది నిజమో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.