Puri jagannath : ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. అయితే ఇటీవలే ఆయన కొడుకు ఆకాష్ పూరీ హీరీగా నటించిన చిత్రం చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే దీనికి పూరీ రాలేకపోయారు. దీంతో నిర్మాత బండ్ల గణేష్ వేదికపైనే పూరీపై కామెంట్లు చేశారు. దేశం మొత్తం కల్లాపి చల్లాడు కానీ… ఇంటి ముందు కల్లాపి చల్లేందుకు టైం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు వేశాడు. అలాగే కన్న కొడుకు ఫంక్షన్ కు వచ్చేంత టైం లేదా అంటూ ప్రశ్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పూరీ తాజాగా స్పందించాడు.
“గుర్తు పెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్ లో ఎక్కువ టైం లిసనర్స్ గా ఉంటే చాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ జనాలు, ఆఖరికి కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్ గా వాగొద్దు, చీప్ గా ప్రవర్తించొద్దు. మన వాగుడే మన కెరియర్ డిసైడ్ చేస్తుంది. తప్పు మాట్లాడడం కంటే నాలుక కొరికేసుకోవడం మంచిది. ఫైనల్ గా ఓ మాట.. మీ బతుకు, నీ చాలు నాలుక మీదే ఆధారపడి ఉంటుంది”. అంటూ యూట్యూబ్ లో ఓ ఆడియోను వదిలాడు పూరీ. దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ… బండ్లన్నకు అదిరిపోయే పంచ్ ఇచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Akash puri: ఛార్మి, పూరి జగన్నాథ్ ల రిలేషన్ పై నోరు విప్పిన ఆకాష్.. ఏమన్నాడంటే?