Petrol price today : ఓ వైపు గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు దూసుకుపోతున్నాయి. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల డీరల్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ధరలు మరింత పైకి కదిలొచ్చని తెలుస్తోంది. డీలర్ మిషన్ ఐదు ఏళ్లుగా పెంచలేదని పెట్రోల్ బంకుల డీలర్లు నిరసనకు దిగారు. దేశ వ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని డీలర్లు ఈ సిరసనలో భాగం అయ్యారు. అయితే వీరంతా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనకూడదని నిర్ణయించారు.

దాదాపు 70 వేల వరకు పెట్రోల్ బంకుల డీలర్లు ఆయిల్ కంపెనీల నుంచి ఫ్యూయెల్ కొనరని అర్థం అవుతోంది. ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల డీలర్లపై ప్రతికూల ప్రభావం పడిందని దిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనురాగ్ నారాయణ్ తెలిపారు. 2017 నుంచి చూస్తే ధరలు దాదాపు రెట్టింపు అయ్యానియని.. అందువల్ల డీలర్ల కమిషన్ పెంచాలని కోరారు.
అలాగే నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Read Also :Petrol, diesel price : దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు