...

Petrol, diesel price : దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రంలోని భాజపా సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర సర్కారు ప్రకటించింది. గత కొద్ది నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.120 వద్ద ఉండేది. భారీగా పెంచుతూ పోయిన ఇంధన ధరలపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ధరల పెరుగదలపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.

Petrol, diesel price
Petrol, diesel price

ఈ స్థాయిలో ధరలు భారీగా పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ విపక్ష పార్టీ నేతల విమర్శలను, దేశ ప్రజల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన పట్టించుకోలేదు. ఇంకా ఇంకా పెంచుతూనే పోయింది. మన చుట్టూ ఉన్న దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఆఖరికి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో కూడా పెట్రోల్ ధరలు భారత్ కంటే తక్కువే ఉన్నాయని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కేంద్రంలోని ప్రభుత్వం కానీ కేంద్రమంత్రులు, భాజపా నేతలు కానీ ఎక్కడా స్పందించలేదు.

ఇప్పుడు తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తూ సామాన్యులకు కొంత ఊరట నిచ్చింది కేంద్ర సర్కారు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇంధన ధరలు తగ్గించడం ఇది రెండో సారి. అయితే రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయా లేదా అనే ది చూడాల్సి ఉంది.
Read Also : Gold Prices Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?