...

Tips for black hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఈ రసాన్ని రాయాల్సిందే!

Tips for black hair: మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పిల్లల్లో కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే కనిపించే ఈ తెల్ల వెంట్రుకలు… ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ… హెయిర్ షాంపూలు, డైలు, స్ప్రేలు, నూనెను వాడుతుంటారు. కానీ వీటన్నిటి కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ చిట్కా ద్వారా తెల్ల వెంట్రుకల సమస్యలను పూర్తిగా తొలగించుకోవచ్చు. అయితే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంటి పరిసరాల్లో ఉండే బిళ్ల గన్నేరు మొక్కలు తెల్ల జుట్టును నల్లగా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మొక్కల పువ్వులు కొన్ని తెలుపు రంగులో, కొన్ని గులాబీ రంగులో ఉంటాయి. అయితే గులాబీ రంగులో ఉండే మొక్క ఆకులను సేకరించి… వాటికి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటి నుంచి రసం తీయాలి. రెండు స్పూన్ల ఆక రసంలో ఒక పూర్తి నిమ్మకాయం రసం… టీ స్పూన్ కొబ్బరి నూనె కలపాలి.

దీన్ని జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దానా చేసి బాగా మసాజ్ చేయాలి. అనంతరం తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే… జుట్టు నల్లగా, పొడవుగా, దృఢంగా తయారవుతుంది. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి. కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.