Intinti Gruhalakshmi May 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, శృతి కోసం ప్రేమతో చీరను కొని సర్ప్రైజ్ ఇస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య నందు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి పరంధామయ్యగారు అంటూ మాట్లాడుతూ కామెడీగా నిద్రపో మని చెప్పగా ఇంతలో పరంధామయ్య అయిపోయిందా తులసీ నాకు నటించడం రాదు అని అనడంతో ఏంటి మామయ్య మీరు ఈ సమయం అయినా పడుకోకుండా ఉన్నారు అని అనడంతో ఆ పరంధామయ్య అసలు విషయం చెబుతాడు.
మరొకవైపు అంకిత పుట్టినరోజు సందర్భంగా తులసి బర్త్డే విషెస్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో తులసి చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అంకిత కు ఫోన్ చేయగా అంకిత ఎంతో సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మీరు కాల్ చేయరేమో అనుకున్నాను కనీసం మా అమ్మ, అభి కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పలేదు ఆంటీ అని బాధ పడుతుంది.
ఆ తర్వాత అక్కడికి దివ్య వచ్చి అంకితకు బర్త్డే విషెస్ చెబుతుంది. అప్పుడు బర్త్ డే పార్టీకీ వస్తున్నారు కదా అని అడగగా అప్పుడు తులసి మాట మార్చే ప్రయత్నం చేయగా ఇంతలో దివ్య అసలు విషయాన్ని చెప్పడంతో, అప్పుడు అంకిత మీరు బర్త్డే పార్టీ కి తప్పకుండా రావాలి మీరు రాకపోతే నేను కేక్ కూడా కట్ చేయను అని మొండిగా పట్టుబట్టడంతో తులసి సరే అని అంటుంది.
అప్పుడు ఆనందంగా థాంక్స్ ఆంటీ అని అంటుంది అంకిత.ఆ తర్వాత అంకిత పుట్టిన రోజు సందర్భంగా అభి ప్రేమతో నెక్లెస్ తీసుకొనిరా గా నీ డబ్బులతో కొనింది అయితే నా మెడలో వేయు లేకపోతే వద్దు అని అనడంతో లేదు అంకిత ఈ నెక్లెస్ నా సొంత డబ్బులను కూడ పెట్టుకొని మరి కొన్నాను అనే అంకిత మెడలో ప్రేమగా వేస్తాడు.
ఆ తర్వాత ప్రేమ్, శృతి లకు అంకిత ఫోన్ చేసి ఎలా అయినాసరే బర్త్డే పార్టీకి రావాలి అని గట్టిగా చెబుతుంది. మరొకవైపు అనసూయ దంపతులు తులసిని ఏమి అడిగినా కూడా ఏమీ పట్టనట్టుగా మాట్లాడుతూ వ్యవహరించడంతో అనసూయ దంపతులు అసలు నీకు ఏమయింది తులసి అని ప్రశ్నిస్తారు.
నాకు ఏమీ కాలేదు అందరూ సిద్ధంగా ఉండండి మనం బర్త్డే పార్టీ కి వెళ్తున్నాం అని అంటుంది తులసి. అందుకోసమే నేను అంకితకు చీర కుడుతున్నాను అని చెబుతుంది.. మరొకవైపు నందు లాస్య ఈ బర్త్ డే పార్టీ తర్వాత అంకితను పూర్తిగా మన వైపు తిప్పుకోవాలి అని ప్లాన్ వేసుకొని అక్కడినుంచి బయలుదేరుతారు. అంకిత కోసం లాస్య ఒక ఖరీదైన చీరను గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటుంది.
రేపటి ఎపిసోడ్ లో లాస్య అంకిత కోసం తెచ్చిన గిఫ్ట్ ను ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంది. ఇంతలో తులసి కూడా వచ్చి చీర ఇవ్వడంతో అప్పుడు అంకిత నాకు ఈ చీర బాగా నచ్చింది నేను బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు కట్టుకుంటాను అని అనడంతో నందు,లాస్య ఫైర్ అవుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Intinti Gruhalakshmi May 28 Today Episode : అంకిత కోసం మాస్టర్ ప్లాన్ వేసిన భాగ్య,లాస్య..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World