Padma Awards 2022 : జనవరి 26, 2022న రిపబ్లిక్ డే (#RepublicDay2022) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అందులో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డు వరించింది. మరో 107 మందికి పదశ్మీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ 2022 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
దివంగత జనరల్ బిపిన్‌రావత్‌తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), ప్రభా ఆత్రే (మహారాష్ట్ర) పద్మ విభూషణ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యతోపాటు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
Padma Awards 2022 : తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మ పురస్కారాలు..
భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (తెలంగాణ)కు పద్మభూషణ్ ప్రకటించింది. సీరమ్ సంస్థ సైరస్ పూనావాలాకు కూడా పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రపంచ టెక్ దిగ్గజాలైన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లకు కూడా పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణలో ఆరుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఇక సుంకర వెంకట ఆదినారాయణ, గోసవీడు హస్సన్ (మరణానంతరం) షేక్‌హసన్ పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య ((కళలు), రామ చంద్రయ్య లకు పద్మశ్రీలు దక్కాయి.

బెంగాల్‌కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్ర నటరాజన్ చంద్రశేఖరన్, సైరస్ పూనావాలా, రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, తెలంగాణలో కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, రాజస్థాన్ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, మెక్సికోకు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల దక్కించుకున్న ప్రముఖుల్లో ఇండియాకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, నటి షాపుకారు జానకి, సోనూ నిగమ్ ఉన్నారు.
Read Also : Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!