Ori Devuda Movie Review: ఫలక్‌నుమాదాస్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్ ను ఆకట్టుకునేలా డిఫరెంట్ మూవీలను చేస్తు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కొన్ని విశ్వక్ సేన్ మూవీలు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. అదే ఉత్సాహంతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్టు చేశాడు. అదే.. ‘ఓరి దేవుడా’ మూవీ.. అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశాడు. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులందరూ చూడదగిన మూవీనా కాదా? ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టగలదా? థియేటర్లలో చూడదగిన మూవీనా కాదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
స్టోరీ (Story) :
ఈ సినిమా లవ్ & రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో మొదలవుతుంది. ఇందులో అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) లవ్ ట్రాక్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే అర్జున్ అను చిన్ననాటి స్నేహితులు.. ఒకరోజున అర్జున్‌ని పెళ్లి చేసుకుంటావా? అని అను అడిగేస్తుంది. దానికి అర్జున్ షాకవుతాడు. అర్జున్ నిర్ణయం చెప్పకముందే తల్లిదండ్రులు పెళ్లి డేట్ కూడా సెట్ చేస్తారు. వీరిద్దరికి పెళ్లి అవుతుంది. కానీ, అనును ఒక స్నేహితురాలుగా మాత్రమే చూస్తాడు అర్జున్. జీవితాంతం ఆమెతో కలిసి ఉండలేనని అర్జున్ భావిస్తాడు. తన స్కూల్లో చదివిన సీనియర్ మీరా అర్జున్ కంటపడుతుంది. ఆ తర్వాత అర్జున్ తన వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా స్టోరీ..
నటీనటులు వీరే :
మూవీలో విశ్వక్ సేన్ (హీరో), వెంకటేష్ దగ్గుబాటి (గెస్ట్ రోల్), మిథిలా పాల్కర్ (అను), ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ నటించారు. మూవీ దర్శకుడిగా అశ్వత్ మరిముత్తు వ్యవహరించగా.. PVP సినిమా & శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ వి. పొట్లూరి మూవీని నిర్మించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా.. విధు అయ్యన సినిమాటోగ్రఫీ అందించాడు.
Movie Name : | Ori Devuda (2022) |
Director : | అశ్వత్ మరిముత్తు |
Cast : | విశ్వక్ సేన్, వెంకటేష్ దగ్గుబాటి, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు |
Producers : | పెరల్ V. పొట్లూరి, పరమ V. పొట్లూరి |
Music : | లియోన్ జేమ్స్ |
Release Date : | 21 అక్టోబర్ 2022 |
Ori Devuda Movie Review : విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?
ఓరి దేవుడా మూవీ.. తమిళ మూవీ ‘ఓ మై కడవులే’కి అఫీషియల్ రీమేక్ అని చెప్పాలి. తెలుగు వెర్షన్‌లో సీన్లు పెద్దగా మార్చినట్టుగా కనిపించలేదు. గతంలోనూ ఇదే లవ్ డ్రామాతో వచ్చిన చాలానే ఉన్నాయి. అయితే ఈ మూవీలో కొంచెం వెరైటీగా అనిపించేలా కథను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఎక్కువగా విశ్వక్ సేన్ శరీరంలోకి వెంకీ పరకాయ ప్రవేశం చేసే సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకీతో విశ్వక్ సేన్ సీన్లు కొత్తగా అనిపించేలా ఉన్నాయి. ప్రేక్షకులలో కొంతవరకు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఈ మూవీలో స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. చాలాచోట్ల సీన్లు రొటీన్‌గా అనిపించేలా ఉన్నాయి. స్క్రీన్‌ప్లేతో సరికొత్తగా అనిపిస్తుంది. ముందుగా కోర్టు సీన్లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అర్జున్ వెంకీని కలవడం.. తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం వంటి సన్నివేశాలతో స్క్రీన్‌ప్లే చక్కగా ఉంటుంది. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాను రూపొందించారు.
విశ్వక్‌సేన్ నటన విషయానికి వస్తే.. అర్జున్‌గా విశ్వక్ సేన్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. కొన్ని సీన్లలో విశ్వక్‌సేన్ ఓవరాక్షన్ అనిపించేలా ఉంది. ఏదిఏమైనా నటనవరకు పర్వాలేదు కానీ, యూత్ ను ఆకట్టుకోవాలంటే ఏదైనా కొత్త డిఫరెంట్ లుక్ చూపిస్తే బాగుండేది. హీరోయిన్ మిథిలా పాల్కర్ ‘లిటిల్ థింగ్స్’ సిరీస్‌లో నటించింది. తెలుగు మూవీలో నటించడం ఫస్ట్ టైం అయినా అను పాత్రలో పాల్కర్ ఒదిగిపోయింది. వెంకీ గెస్ట్ రోల్ తనదైన కామెడీతో మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ అసిస్టెంట్‌గా నటించడం ప్లస్ అయింది. ఇక ఆశా భట్ నటన పర్వాలేదనిపించింది.
మురళీ శర్మతో పాటు ఇతర నటులు తమ పాత్రకు తగినట్టుగా నటించి మెప్పించారు. టెక్నికల్‌గా చూస్తే.. ఓరి దేవుడా మూవీ మంచి కాఫీ లాంటి సినిమా అని చెప్పవచ్చు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. అనిరుధ్ పాటలు బాగా వచ్చాయి. విధు అయ్యనా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. చాలావరకు గ్రాఫిక్స్ సీన్లు అంతగా ప్రేక్షకులను కట్టిపడేసేలా లేవని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే.. ఓరి దేవుడా మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ.. ఫ్యామిలీతో కలిసి అందరూ థియేటర్లకు వెళ్లి చూడదగిన సినిమా..
[ Tufan9 Telugu News ]
ఓరి దేవుడా
సినిమా రివ్యూ రేటింగ్ : 3.2/5
Read Also : God Father First Review : గాడ్ ఫాదర్‌కు చెత్త రివ్యూ.. నీ ఫేక్ రివ్యూలు ఆపేయ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్..!